Gastric Problem Solutions | గ్యాస్ట్రిక్ సమస్యకు ఇంట్లోనే అద్భుతమైన పరిష్కారం

ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్. సమస్య ఉన్నవాళ్లకే కాదు.. పక్కన వాళ్లకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నూటికి 80 శాతం మందికి ఈ గ్యాస్ సమస్య ఉందనేది ఓ అంచనా. అసలు ఈ గ్యాస్ కడుపులో ఎందుకు ఫామ్ అవుతుంది?

gastic problem solution

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్. సమస్య ఉన్నవాళ్లకే కాదు.. పక్కన వాళ్లకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నూటికి 80 శాతం మందికి ఈ గ్యాస్ సమస్య ఉందనేది ఓ అంచనా. అసలు ఈ గ్యాస్  కడుపులో ఎందుకు ఫామ్ అవుతుంది? గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించుకునే న్యాచురల్ రేమీడిస్‌ని తెలుసుకుందాం.. మనం ఎప్పుడైన భోజనం చేసినప్పుడు కానీ, నీళ్లు తాగినప్పుడు గానీ కొంత గాలిని మింగేస్తుంటాం. అదే మనకు గ్యాస్ రూపంలో బయటకు వస్తుంది. ఇంకో విధంగా ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ సరిగ్గా జీర్ణం కాకపోతే, అది మన కడుపులో ఎక్కువసేపు ఉండి, పులిసి గ్యాస్‌గా విడుదల అవుతుంది. మోషన్ సరిగ్గా  రాకపోయినా, ఫుడ్‌ని అవసరం కంటే ఎక్కువగా తీసుకున్నా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన గ్యాస్ ఒక్కోసారి బయటకు వెళ్లలేక కడుపులోపల ఉబ్బరంగా అనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే.. డైట్‌ను మార్చుకోవడం చాలా ముఖ్యం.

మనం ఎప్పుడు తింటున్నాం.. ఎప్పుడు పడుకుంటున్నాం.. ఎన్ని గంటలు నిద్ర ఉంటుంది.. ఫిజికల్ యాక్టివిటీ ఉందా? లేదా? ఇవన్నీ ఫోకస్ చేయాలి. భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా, నమిలి తినడం నేర్చుకోవాలి. భోజనం ఎప్పుడు కూడా 75 శాతం మాత్రమే తిని, 25 శాతం కడుపు ఖాళీగా ఉంచుకోవాలి. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. గ్యాస్ ఫామ్ అవ్వదు. భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఆహారం తినేటప్పుడు ఆహారంతో పాటు ఎక్కువగా నీళ్లు కలిసి పొట్టలో ఎక్కువసేపు ఉండి, పులిసి అవి గ్యాస్‌ని రీలిస్ చేస్తుంటాయి. బిర్యానీలు, జంక్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. మామూలుగానే జంక్ ఫుడ్ హెవీ. దానికి తోడుగా కూల్‌డ్రింక్స్ తీసుకోవడం వల్ల అది డైజేషన్‌ని స్లోడౌన్ చేసేస్తుంది. మన పొట్టలో ఎక్కువసేపు ఉండి ఇవి గ్యాస్‌ను రీలిజ్ చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. 

గ్యాస్ట్రిక్ సమస్యను న్యాచురల్‌గా తగ్గించే కొన్ని ఇంటి చిట్కాలు:

వాము: వాము గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే వాము నీటిని తీసుకోండి. దీనివల్ల గ్యాస్ నుంచి విముక్తి కలుగుతుంది.

మజ్జిగ: భోజనం చేసిన తర్వాత మజ్జిగలో కొంచెం వేయించిన జీర పౌడర్ వేసి తాగితే జీర్ణం చురుగ్గా అవుతుంది.

అల్లం: భోజనం చేసిన తర్వాత అల్లం టీని తాగడం వల్ల జీర్ణక్రియ సరిగా పనిచేస్తుంది. కూరల్లోనూ ఎక్కువగా అల్లాన్ని వాడటం మంచిది.

పైనాపిల్: పైనాపిల్‌లో ప్రోటిన్స్‌ని బ్రేక్‌డౌన్ చేసి డైజేషన్‌ని ఈజీగా, ఫాస్ట్‌గా చేసే లక్షణాలు ఉంటాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్