పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం వల్ల తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి కొన్ని మంచి ఆహారపు అలవాట్లను గర్భిణీ గా ఉన్న సమయంలో మహిళలు చేసుకోవడం చాలా అవసరం. గర్భిణీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు అనేకం ఉన్నాయి. వీటిలో ఒక పండు గర్భిణీ ఆరోగ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటు ఉత్సాహంగా ఉండేందుకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే ఆరెంజ్ పండు. ఈ ఆరంజ్ పండు వల్ల విటమిన్ సి గర్భిణీకి పుష్కలంగా లభిస్తుంది.
ఆరెంజ్ పండు
మాతృత్వం అనేది ప్రతి మహిళ తన జీవితంలో గొప్ప వరంగా భావిస్తుంటుంది. అమ్మతనానికి దగ్గరవుతున్న కొద్ది ఆ తల్లి ఆనందానికి అవధులే ఉండవు. అటువంటి గర్భిణి ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత అనేకమంది మహిళల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏది తినబుద్ధి కాకపోవడం, తిన్నా వాంతులు అవుతుండడం వంటి ఇబ్బందులు ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో గర్భిణీ ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం వల్ల తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి కొన్ని మంచి ఆహారపు అలవాట్లను గర్భిణీ గా ఉన్న సమయంలో మహిళలు చేసుకోవడం చాలా అవసరం. గర్భిణీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు అనేకం ఉన్నాయి. వీటిలో ఒక పండు గర్భిణీ ఆరోగ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటు ఉత్సాహంగా ఉండేందుకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే ఆరెంజ్ పండు. ఈ ఆరంజ్ పండు వల్ల విటమిన్ సి గర్భిణీకి పుష్కలంగా లభిస్తుంది. ప్రతిరోజు ఒక పండు తీసుకోవడం వల్ల గర్భిణీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదే సమయంలో ఈ పండులో ఉండే ఫోలేట్ అధికంగా ఉండడంతో బిడ్డ మెదడు అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ పండులో అధికంగా ఉండే ఫైబర్ వల్ల గర్భంలో ఉత్పన్నమయ్యే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. నారింజ పండు లో ఉండే పీచు గర్భధారంలో వచ్చే మలబద్ధక సమస్యలను నయం చేస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు గర్భిణీకి ఉత్పన్నం కావు. దీనివల్ల గర్భిణి ఉత్సాహంగా ఉండేందుకు రోజువారి కార్యకలాపాలను ప్రశాంతంగా జరుపుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆరంజ్ పండుగలో ఉండే పొటాషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. గర్భం దాల్చిన తర్వాత అనేకమంది మహిళల్లో బిపి కంట్రోల్ తప్పుతుంది. ఈ పండు తినడం వల్ల బీపీ కూడా నియంత్రణలోనూ ఉండి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గర్భిణీల చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. తక్కువ క్యాలరీలతో శరీర బరువు నియంత్రణకు కూడా ఈ పండు దోహదం చేస్తుంది. గర్భం దాల్చిన తర్వాత మహిళలు ఎక్కువగా డిహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని ఆరెంజ్ పండుగ ఇస్తుంది. ఇందులో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. రక్తంలో చక్కర స్థాయిలను సరిగా ఉంచడంలో ఈ పండు సహాయపడుతుంది. తేలికపాటి యాసిడ్ గర్భిణీల్లో తలనొప్పి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఉపకరిస్తుంది. సాధారణంగా రోజుకు ఒక పండు తింటే గర్భిణీ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భిణీ ఆరోగ్యానికి అనుగుణంగా రోజుకి ఎన్ని పనులు తినాలి అనే దానిని వైద్యనిపుణుల సలహా మేరకు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
గర్భం దాల్చిన మహిళలు తప్పనిసరిగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల గర్భం దాల్చిన మహిళ ఆరోగ్యంగా ఉండడంతో పాటు పొట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చిన తర్వాత కొన్ని రకాల మార్పులు కారణంగా మహిళల్లో ఒత్తిడి పెరుగుతుంది. వీటితోపాటు కుటుంబ పరమైన వ్యవహారాలు, ఆర్థిక అంశాలు కూడా మరింత ఒత్తిడికి గురి చేస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఏ విషయంలో గర్భిణీ తగిన జాగ్రత్తలను పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.