కొండగట్టు ఆంజనేయస్వామిని మాజీమంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. బుధవారం రాత్రి కొండగట్టుకు చేరుకున్న ఆయన రాత్రి అక్కడే బస చేశారు. గురువారం ఉదయం ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ముందు కట్టిన ముడుపు విప్పి మొక్కు చెల్లించుకున్నారు.