భారత్ ను హెచ్చరించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్.. బంగ్లా అస్థిరత భారత్ కు ముప్పు అంటూ వ్యాఖ్య

బంగ్లాదేశ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితులైన నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్ అస్థిరపడితే భారత్ కు ప్రమాదం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ లో అస్తిర పరిస్థితులు నెలకొంటే ఈశాన్య భారతం, బెంగాల్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.

Muhammad Yunus

మహ్మద్ యూనస్

బంగ్లాదేశ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితులైన నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్ అస్థిరపడితే భారత్ కు ప్రమాదం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ లో అస్తిర పరిస్థితులు నెలకొంటే ఈశాన్య భారతం, బెంగాల్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. మయన్మార్ కూడా ఇందుకు మినహాయింపు కాదని మహ్మద్ యూనస్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఒకరకంగా భారత్ కు హెచ్చరికగా భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు, అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు భారత్ కారణమన్న భావనతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బిఎన్పీ) కూడా భారత్ కు వార్నింగ్ ఇచ్చింది.  తమ శత్రువుకు ఆశ్రయమిస్తే భారత్ బంగ్లా మధ్య పరస్పర సహకారం కష్టమవుతుందని స్పష్టం చేసింది. హసీనా పాలనలో చాలా ఏళ్లుగా శాంతిభద్రతలు లోపించాయని ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. 

వేల మంది బంగ్లా దేశీయులు నిరీక్షణ..

బంగ్లాదేశ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో ఆ దేశం ఇప్పటికీ అట్టుడుతోంది. బంగ్లాదేశ్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని భారతదేశంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేలాది మంది బంగ్లాదేశ్ వాసులను బిఎస్ఎఫ్ బలగాలు సరిహద్దుల్లో అడ్డుకుంటున్నాయి. వీరిలో అత్యధికులు హిందువులు కావడం గమనార్హం. గత వారం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినప్పటి నుంచి అక్కడి హిందువులు, బౌద్ధులు, ఇతర మైనారిటీలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. వారి ఆస్తులు, వ్యాపారాలు ధ్వంసం చేస్తున్నారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన ఇద్దరు హిందూ నేతలు హత్యకు గురికావడం హిందువుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రాణ భయంతో పలువురు భారత్ వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి. శుక్రవారం బెంగాల్లోని కుచ్ బీహార్ జిల్లా శీతాల్ కుర్చీ సరిహద్దు కంచె దూకి వచ్చేందుకు వెయ్యి మంది ప్రయత్నించగా భారత బలగాలు వమ్ము చేశాయి. సరిహద్దుకు సమీపంలో వారంతా సమావేశమై తమను భారత్ కు రానివ్వాలని నినాదాలు చేశారు.  మరోవైపు బంగ్లాదేశ్ లో హిందువులపై ప్రాణాంతక దాడులు, ఆస్తులు లూటీ ధ్వంసం నేపథ్యంలో ఆ దేశ ప్రజలు భారీ సంఖ్యలో భారత్లోకి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాలోని భారతీయులు, హిందువులు ఇతర వర్గాల భద్రతను పర్యవేక్షించేందుకు ప్రధాన మోడీ ఒక కమిటీని నియమించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ కమిటీ బంగ్లా అధికారులతో నిరంతరం సంప్రదిస్తుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో హిందువులపై హింసాత్మక దాడులు జరగడంపై ఆర్ఎస్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ హిందువులు, ఇతర మైనారిటీల భద్రతకు సాధ్యమైనంత కృషి చేయాలని సంఘ్ ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్