కేజ్రీవాల్, ఆప్ మంత్రులకు యోగి ఆదిత్యనాథ్ సవాల్.. యమునా నదిలో స్నానం చేయగలరా.? అంటూ ప్రశ్న

ఢిల్లీ ఎన్నికల వేడి పెరుగుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల తరఫున కీలక నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బిజెపి తరఫున ప్రచారానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. గురువారం పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన ఆయన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు, మంత్రులకు సవాల్ విసిరారు. యూపీ క్యాబినెట్ మంత్రులంతా ప్రయాగ్ రాజ్ లోని సంఘంలో స్నానం చేశామని, తమ మాదిరిగా కేజ్రివాల్, ఢిల్లీ మంత్రులు కూడా యమునా నదిలో స్నానం చేయగలరా.? అని యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు.

UP CM Yogi Adhitya Nath in campaign

ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి అధిత్య నాథ్

ఢిల్లీ ఎన్నికల వేడి పెరుగుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల తరఫున కీలక నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బిజెపి తరఫున ప్రచారానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. గురువారం పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన ఆయన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు, మంత్రులకు సవాల్ విసిరారు. యూపీ క్యాబినెట్ మంత్రులంతా ప్రయాగ్ రాజ్ లోని సంఘంలో స్నానం చేశామని, తమ మాదిరిగా కేజ్రివాల్, ఢిల్లీ మంత్రులు కూడా యమునా నదిలో స్నానం చేయగలరా.? అని యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. రాజధాని ఢిల్లీలోని కిరారిలో జరిగిన ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలను గుర్తించారు. ఢిల్లీని చెత్తకుప్పగా మార్చారని కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ పదేపదే ఉత్తరప్రదేశ్ ను విమర్శిస్తారని, కానీ ఇప్పుడు ప్రజలంతా ఉత్తరప్రదేశ్లో నమోనాగా చూస్తున్నారన్న విషయం మరచిపోవద్దని హితవు పలికారు. యూపీని చూసి ఆప్ నేర్చుకోవాలన్న యోగి ఆదిత్యనాథ్.. అభివృద్ధి అంటే ఏమిటో ఒకసారి ఢిల్లీ రోడ్డు, యూపీ రోడ్లు చూస్తే అర్థమవుతుందన్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాలకు ఢిల్లీలో స్థిర నివాసం కల్పించారని యోగి సంచలన ఆరోపణలు చేశారు.

అటువంటి వారందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ఇళ్లల్లో ఆధార్ కార్డులు ఇస్తున్నారని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి త్రివేణి సంగమంలో స్నానం చేయడం అంటే భారతీయ సంస్కృతి, సనాతన ధర్మానికి చిహ్నంగా ఆయన అభివర్ణించారు. ఆధ్యాత్మిక శాంతి, మతపరమైన భక్తి, సామాజిక సంక్షేమాన్ని ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5వ తేదీన అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన విడుదల కానున్నాయి. ఎన్నికలను ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ, బిజెపి, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ ప్రయత్నిస్తుండగా.. ఇక్కడ అధికారం దక్కించుకోవడం లక్ష్యంగా బిజెపి, కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతున్నాయి. అందుకు అనుగుణంగానే ప్రజలను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున హామీలను ప్రధాన పార్టీలు గుప్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా తమ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ప్రచారానికి బరిలోకి దించుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం పలుచోట్ల ప్రచారాన్ని బిజెపి అభ్యర్థుల కోసం నిర్వహించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్