వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాదులో అరెస్టు చేశారు. గురువారం ఉదయం హైదరాబాదులో నాటికి పరిణామాల మధ్య వంశీని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పొందారు. అయినప్పటికీ పోలీసులు అరెస్టు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది ఎలా ఉంటే ఈ కేసులో ఫిర్యాదుదారుడు సత్య వర్ధన్ తరఫునయాలను కొద్దిరోజుల కిందటే వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల కుట్రను మెజిస్ట్రేట్ ముందు సత్య వర్ధన్ బయటపెట్టారు.

Vallabhaneni Vamsi arrested

అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాదులో అరెస్టు చేశారు. గురువారం ఉదయం హైదరాబాదులో నాటికి పరిణామాల మధ్య వంశీని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పొందారు. అయినప్పటికీ పోలీసులు అరెస్టు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది ఎలా ఉంటే ఈ కేసులో ఫిర్యాదుదారుడు సత్య వర్ధన్ తరఫునయాలను కొద్దిరోజుల కిందటే వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల కుట్రను మెజిస్ట్రేట్ ముందు సత్య వర్ధన్ బయటపెట్టారు. అయినప్పటికీ పోలీసులు వంశీని అరెస్టు చేయడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదే కేసులో అరెస్టు చేశారా లేక మరో కేసులో అరెస్టు చేశారా అన్నదే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అరెస్టు తెలుసుకున్న వైసీపీ నాయకులు విజయవాడలో వంశీని తీసుకెళ్లబోతున్న పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన కీలక నేతలను అరెస్టు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగామ సురేష్ వంటి నేతలు కొన్ని నెలల తరబడి జైల్లో ఉండి వచ్చారు. తాజాగా వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. 

ఇద్దరు నేతలే టార్గెట్ 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరు నేతలని అరెస్టు చేయాలన్న డిమాండ్ ఆ పార్టీకి చెందిన కార్యకర్తల నుంచి వస్తోంది. వీరిలో ఒకరు వల్లభనేని వంశీ కాగా, మరొకరు కొడాలి నాని. ఇద్దరు నేతలు గతంలో వైసిపి అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు, వారి కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వీరిపై గతంలోనే ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు. తాజాగా వంశీని అరెస్టు చేయడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏ కేసులో అరెస్టు చేశారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. వంశీని విజయవాడ తీసుకెళ్లిన తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్