ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్టు చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.
జైలు బయట మాట్లాడుతున్న జగన్
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్టు చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో విజయవాడ అతలాకుతలం అయిందని, బాబు తప్పిదాలను డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం నాటి కేసును తెరపైకి తెచ్చారని, సిటింగ్ సీఎంను టిడిపి నేత దారుణంగా బోసిడికే అనే దూషించాడన్న జగన్.. తాను చంద్రబాబు మాదిరిగా కక్ష సాధింపులకు పాల్పడలేదన్నారు. 41ఎ కింద నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టామని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. నాటి ఘటనలో నందిగామ సురేష్ ఉన్నాడా అని ప్రశ్నించిన జగన్ మోహన్ రెడ్డి.. చేసే ఫుటేజీలో ఎక్కడైనా సురేష్ కనబడ్డాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని, కూటమి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుందని, మీ నాయకులకు ఇదే గతి పడుతుందని, ఇదే జైల్లో ఉంటారని జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. రెడ్ బుక్ పెట్టుకోవడం ఘనకార్యం కాదని, పాలన గాలికి వదిలేసి రేట్ బుక్ పైనే బాబు దృష్టిపెట్టాడని విమర్శించారు. తుఫాను వస్తుందని ముందే చెప్పిన బాబు పట్టించుకోలేదని, తన ఇంటిని రక్షించుకునేందుకు విజయవాడను ముంచారని విమర్శించారు.
గోడ మీరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేసారని ఆరోపించారు. 60 మందిని పొట్టను పెట్టుకున్న బాబు పై కేసు ఎందుకు పెట్టరని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బోట్లకు ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చిందని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు గెలవగానే ఇదే బోట్లపై విజయోత్సవాలను చేసిన విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. బాబు, లోకేష్ తో కలిసి బోటు ఓనర్ ఉషాద్రి ఫోటోలు దిగాడని, టిడిపి హయాంలోనే ఈ బోట్లకు అనుమతి ఇచ్చారని స్పష్టం చేశారు. ఆ బోట్లన్ని టిడిపి నేతలకు చెందినవేనని, వాస్తవాలను వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు తోడుగా నిలవకుండా నేరాన్ని తమపై నెడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీలు మోసమని తేలాయని, రాష్ట్రంలో పాలన ఉందా..? అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది అన్నారు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, ఇంటింటికి సేవలను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సాయం చేయలేదని, అమ్మ ఒడి పథకాన్ని గాలికి వదిలేసారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారన్న జగన్మోహన్ రెడ్డి.. బడుల్లో తిండి తినలేక విద్యార్థులు ధర్నాలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలను ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా చేతులు ఎత్తేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను అమ్మేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు స్వస్తి చెప్పాలని, లేకపోతే భవిష్యత్తులో టిడిపి నాయకులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలకు మేలు చేయాల్సిన విషయాలను విస్మరించి, అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు.