ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అంటూ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్న మహిళలు టెక్ కంపెనీలో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. మహిళా స్టార్టప్ లు, భారీగా నిధుల సమీకరణలోను సత్తా చాటుతున్నాయి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టెక్ రంగంలో దూసుకుపోతున్న మహిళ సామర్ధ్యాన్ని తెలియజేసే ప్రత్యేక కథనం. మహిళల సారధ్యంలోని అంకుర సంస్థలు ఎప్పటి వరకు భారతదేశంలో 26 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాయి. ఆల్ టైం ఫండింగ్ విషయంలో అమెరికా తరువాత స్థానంలో ఈ సంస్థలు నిలిచాయి. రీసెర్చ్, అనాలటిక్స్ సంస్థ ట్రాక్షన్ ఒక నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం దేశయంగా మహిళల సారధ్యంలోని అంకుర సంస్థలు ఏడువేల పైచిలుకు ఉన్నాయి. క్రియాశీలకంగా ఉన్న మొత్తం అంకుర సంస్థల్లో వీటి వాటా 7.5% కాగా.. ఇవన్నీ కలిసి ఎప్పటి వరకు 26.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అంటూ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్న మహిళలు టెక్ కంపెనీలో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. మహిళా స్టార్టప్ లు, భారీగా నిధుల సమీకరణలోను సత్తా చాటుతున్నాయి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టెక్ రంగంలో దూసుకుపోతున్న మహిళ సామర్ధ్యాన్ని తెలియజేసే ప్రత్యేక కథనం. మహిళల సారధ్యంలోని అంకుర సంస్థలు ఎప్పటి వరకు భారతదేశంలో 26 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాయి. ఆల్ టైం ఫండింగ్ విషయంలో అమెరికా తరువాత స్థానంలో ఈ సంస్థలు నిలిచాయి. రీసెర్చ్, అనాలటిక్స్ సంస్థ ట్రాక్షన్ ఒక నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం దేశయంగా మహిళల సారధ్యంలోని అంకుర సంస్థలు ఏడువేల పైచిలుకు ఉన్నాయి. క్రియాశీలకంగా ఉన్న మొత్తం అంకుర సంస్థల్లో వీటి వాటా 7.5% కాగా.. ఇవన్నీ కలిసి ఎప్పటి వరకు 26.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2021లో అత్యధికంగా 6.3 బిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. 2022లో అంతర్జాతీయంగా చూస్తే మహిళలకు సంబంధించిన అంకుర 32.8 బిలియన్ డాలర్లు సమీకరించాయి. దేశీ అంకురాలు ఐదు బిలియన్ డాలర్లతో 15.18 శాతం వాటాను దక్కించుకున్నాయి. 2024లో అంతర్జాతీయంగా మహిళల సారధ్యంలోనే స్టార్టప్ లకు ఫండింగ్ విషయంలో 3.96 శాతం వాటాతో అమెరికా, బ్రిటన్ తరువాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఈ స్టార్ట్ తప్పులకు భారీగా నిధులను సమీకరించడంతోపాటు పరిశ్రమలకు కొత్త నిర్వచనాన్ని ఇస్తూ ఉద్యోగాలు కల్పిస్తూ భవిష్యత్తు ఎంటర్ప్రైన్లకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని ట్రాక్సన్ సంస్థ పేర్కొంది.
ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం రంగాల వారీగా చూస్తే రిటైల్ స్టార్ట్ అప్పులు అత్యధికంగా 7.8 బిలియన్ డాలర్లు ఆర్జించాయి. ఎడ్ టేక్ 5.4 బిలియన్ డాలర్లు, ఎంటర్ప్రైస్ అప్లికేషన్స్ అంకురాలు ఐదు బిలియన్ డాలర్లు సమీకరించాయి. బిజినెస్ టు కన్జ్యూమర్ ఈ కామర్స్, ఇంటర్నెట్ ఫస్ట్ బ్రాండ్లు, ఫ్యాషన్ టెక్ అంకురాలు కూడా ఘనంగా రాణిస్తున్నాయి. మహిళ అంకురాల సంఖ్యాపరంగా ఇప్పటివరకు సమీకరించిన నిధులు పరంగా బెంగుళూరు అగ్రస్థానంలో ఉంది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 2021లో మహిళల సారధ్యంలోని అంకురాలు అత్యధికంగా ఎనిమిది అంకురాలు యూనికార్నలుగా ఎదిగాయి. 2019లో మూడు, 2020లో 4, 2022లో ఐదు ఈ హోదాను సాధించాయి. 2017, 2023, 2024 లో ఒక్క యూనికార్ను కూడా నమోదు కాలేదు. 2021లో మహిళ అంకుర సంస్థలు అత్యధికంగా 45 సంస్థలను కొనుగోలు చేశాయి. 2022లో ఇది 36కు, 2023లో 25కి, 2024 లో 16కు తగ్గింది. 2024లో మహిళల సారధ్యంలోని ఐదు స్టార్టప్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ కి వచ్చాయి. ఏది ఏమైనా తిక్క రంగాల్లో కూడా మహిళలు అద్భుతంగా రాణిస్తూ ముందుకు సాగుతూ సత్తాను చాటుతున్నారు.