ఉత్తరప్రదేశ్ లోని ఒక జిల్లా ప్రజలను తోడేళ్లు వణికిస్తున్నాయి. ప్రజలకు కంటినిండా పులుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ తోడేళ్లు పరువు చిన్నారులను పొట్టన పెట్టుకున్నాయి. రాత్రి అయితే ఎవరికి కంటిమీద కునుకు కూడా పట్టని పరిస్థితి ఇక్కడ ప్రజల్లో నెలకొంది. గడిచిన నెలన్నరలో ఎనిమిది మందిని ఈ తోడేళ్లు చంపేసాయి. వీరిలో ఏడుగురు చిన్నారులే కావడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
వలకు చిక్కిన తోడేళ్లు
ఉత్తరప్రదేశ్ లోని ఒక జిల్లా ప్రజలను తోడేళ్లు వణికిస్తున్నాయి. ప్రజలకు కంటినిండా పులుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ తోడేళ్లు పరువు చిన్నారులను పొట్టన పెట్టుకున్నాయి. రాత్రి అయితే ఎవరికి కంటిమీద కునుకు కూడా పట్టని పరిస్థితి ఇక్కడ ప్రజల్లో నెలకొంది. గడిచిన నెలన్నరలో ఎనిమిది మందిని ఈ తోడేళ్లు చంపేసాయి. వీరిలో ఏడుగురు చిన్నారులే కావడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. బహ్రాయిచ్ జిల్లాలోని మహసి ప్రాంతంలో ఈ తోడేళ్ల ప్రభావం అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరు నెలల కిందట ఈ ప్రాంతంలోకి తోడేళ్లు ప్రవేశించాయి. ప్రజలపై దాడి చేస్తూ పరిసర 100 గ్రామాలను హడలెత్తిస్తున్నాయి. ప్రతి నాలుగైదు రోజులకు ఒక కొత్త గ్రామాన్ని ఎంచుకుంటున్నాయి. ప్రతిఘటించలేని వారు కావడంతో ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. రాత్రివేళ వేట పూర్తి చేసుకుని తెల్లవారేసరికి గుహకు చేరుకుంటున్నాయి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు స్థావరాలను మారుస్తూ ఎవరికీ చిక్కడం లేదు. ఆదివారం రాత్రి రెండేళ్ల గరేటి గురుదత్ సింగ్ గ్రామంలో తల్లి పక్కన నిద్రిస్తుండగా లాక్కెల్లాయి.
సోమవారం మౌజా కొట్టియా గ్రామంలో ఇద్దరు మహిళలను తీవ్రంగా గాయపరిచాయి. హర్దీ ప్రాంతంలో తెల్లవారుజామున ఐదేళ్ల పరాస్ పై మెడ పట్టుకుని లాక్కెళ్తుండగా అతని తల్లి గుడిచితంగా పోరాడి తోడేళ్లను తరిమేసింది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వం కూడా ఈ తోడేళ్ల గుంపును తరిమికొట్టడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహసిలో తోడేళ్ల బెడదపై యూపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆపరేషన్ భేడియా చేపట్టింది. వాటి జాడ తెలుసుకునేందుకు డ్రోన్లు ఉపయోగించింది. ఉచ్చులు, బోన్లు పెట్టి నాలుగు తోడేళ్లను ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టుకుంది. మిగతా రెండు మాత్రం ముప్పు తిప్పలు పెడుతున్నాయి. దీంతో మనిషి వాసనకు ఆకర్షితమై ఉచ్చులో చిక్కేందుకు ఆట బొమ్మలను పిల్లల మూత్రంతో తడిపి తోడేలు సంచరించే ప్రాంతాల్లో ఉంచుతున్నారు. బహ్రయిచ్ తోపాటు పొరుగునున్న సీతాపూర్ జిల్లాలోనూ తోడేళ్ల కలకలం రేపుతున్నాయి. ప్రజలను తోడేళ్లు ఇబ్బందులు గురి చేస్తున్న వైనంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం పరిస్థితిని సమీక్షించారు. అటవీ శాఖ అధికారులు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ తోడేళ్ళ పని పట్టాలని ఆదేశించారు.