స్విగ్గి, జోమాటోలతో ఇకపై మద్యం కూడా హోమ్ డెలివరీ

నచ్చిన ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే డెలివరీ చేసే స్విగ్గి, జొమాటోలతో ఇకపై నచ్చిన మద్యం బ్రాండ్ కూడా ఆర్డర్ పెట్టుకునే వెసులుబాటు మందుబాబులకు లభించబోతోంది. ఈ మేరకు పలు రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయి. మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతించాలని ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాలు భావిస్తున్నాయి.

Liquor brand

మద్యం బ్రాండ్ 

నచ్చిన ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే డెలివరీ చేసే స్విగ్గి, జొమాటోలతో ఇకపై నచ్చిన మద్యం బ్రాండ్ కూడా ఆర్డర్ పెట్టుకునే వెసులుబాటు మందుబాబులకు లభించబోతోంది. ఈ మేరకు పలు రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయి. మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతించాలని ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుకు కూడా రూపకల్పన చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల అధికారులు ఇప్పటికే ఫుడ్ డెలివరీ యాప్లతో, మద్యం తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మద్యం హోమ్ డెలివరీ వలన కలిగే లాభ, నష్టాలపై అంచనా వేస్తున్నారని పేర్కొంది. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత బీర్, వైన్ లాంటి తక్కువ ఖరీదైన మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.

నగరాల్లో జీవనశైలి మారుతోందని, పురుషులతోపాటు చాలా మంది మహిళలు మద్యం సేవిస్తున్నారని, వైన్ షాపులకు వెళ్లి మద్యం కొనలేని మహిళలకు హోం డెలివరీ నిర్ణయం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఒడిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం హోమ్ డెలివరీ వెసులుబాటు ఉంది. బెంగాల్లో స్విగ్గి, స్పెన్సర్స్ రిటైల్స్ సంస్థలు మద్యాన్ని ఇంటికి సరఫరా చేస్తున్నాయి. హోం డెలివరీ సేవల ప్రారంభించిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు 20 నుంచి 30% పెరిగినట్లు అంచనా ఉంది. ఇదిలా ఉండగా హోమ్ డెలివరీకి అన్ని నిబంధనలు పాటిస్తామని, వయసు ధ్రువీకరించుకున్న తర్వాతే పరిమితి మేరకు డెలివరీ ఉంటుందని స్విగ్గి కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ తరహా హోమ్ డెలివరీ వలన రోడ్డు ప్రమాదాలు వంటి వాటిని కూడా నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు. అదే సమయంలో బయటకు వెళ్లి తాగలేని వాళ్లు ఇంటి వద్దనే ఉంటూ తాగేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆసక్తి చూపిస్తున్న ఆయా రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు పలువురు నిపుణులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్