గుడికి, బడికి దూరంగా వైన్ షాప్లు.. నూతన మార్గదర్శకాలు విడుదల

గత వైసిపి ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను నిర్వహించగా.. కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు గతంలో మాదిరిగా అప్పగించేందుకు అనుగుణంగా చర్యలను చేపట్టింది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానిస్తోంది. మద్యం దుకాణాలు కావాలనుకునే వాళ్లు టెండర్లలో పోటీ పడాల్సి ఉంటుంది. టెండర్లు దాఖలు చేసిన వారికి లాటరీ పద్ధతిలో షాపులను కేటాయించనున్నారు. ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

Wine shop

 వైన్ షాప్

ఏపీలో నూతన మద్యం విధానం అమలుకు రంగం సిద్ధమవుతోంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. భారీగా తరలిన పెంచి నిరుపేదలను మద్యం విక్రయాలు పేరుతో దోచుకుంది అంటూ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించింది. తాము అధికారంలోకి వస్తే నూతన మద్యం విధానాన్ని అమలు చేయడంతోపాటు అతి తక్కువ ధరకు మధ్యాహ్నం విక్రయిస్తామని హామీ ఇచ్చింది కూటమి. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలను కూటమి ప్రభుత్వం తగ్గించింది. అలాగే, నూతన మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత వైసిపి ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను నిర్వహించగా.. కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు గతంలో మాదిరిగా అప్పగించేందుకు అనుగుణంగా చర్యలను చేపట్టింది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానిస్తోంది. మద్యం దుకాణాలు కావాలనుకునే వాళ్లు టెండర్లలో పోటీ పడాల్సి ఉంటుంది.

టెండర్లు దాఖలు చేసిన వారికి లాటరీ పద్ధతిలో షాపులను కేటాయించనున్నారు. ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త దుకాణాలను గుడి, బడికి దూరంగా ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఈ రెండు చోట్ల ఎక్కడ సమీపంలో దుకాణాలు ఉండకూడదని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి దుకాణంలోనూ తప్పనిసరిగా ఎమ్మార్పీ ధరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలని కమిషనర్ స్పష్టం చేశారు. పర్మిట్ రూములు, బెల్ట్ షాపులకు అనుమతి లేదు.  స్కూల్స్, ఆలయాలకు కనీసం వంద మీటర్ల దాటిన తర్వాతే షాపులు ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు కమిషనర్ ఆదేశాల్లో వెల్లడించారు. ప్రతి షాపులోనూ ఇకపై రెండు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. కొత్త విధానం అమలులోకి వచ్చేంతవరకు పాత విధానమే అమల్లో ఉంటుందని కమిషనర్ ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొత్త షాపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. షాపులు కావాలనుకునేవాళ్లు టెండర్లు వేస్తున్నారు. ఈ టెండర్లను తెరిచి కొద్ది రోజుల్లోనే లాటరీ విధానంలో దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకోసం భారీగా పోటీపడుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్