జీవిత బీమా ప్రీమియం పెరుగుతుందా.! నేటి నుంచి అమల్లోకి సవరించిన పాలసీ

జీవిత బీమా పాలసీల సరెండర్ విలువ సవరణకు సంబంధించి ఐఆర్డిఏఐ చేసిన ప్రతిపాదనలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా బీమా ప్రీమియంలో పెరగడం లేదా ఏజెంట్ల కమిషన్ తగ్గడం జరగవచ్చు అన్న అంచనాలు వెలువడుతున్నాయి. జీవిత బీమా పాలసీదారులు గడువు కన్నా ముందే తమ పాలసీలను సరెండర్ చేసినప్పుడు మెరుగైన ప్రతిఫలాలు అందించడానికి సంబంధించి సవరించిన సరెండర్ వ్యాల్యూ మార్గదర్శకాలను ఈ ఏడాది తొలినాళ్లలో ఐఆర్డిఏఐ తెచ్చింది. ఇవి మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి.

insurance policy

 బీమా పాలసీ

జీవిత బీమా పాలసీల సరెండర్ విలువ సవరణకు సంబంధించి ఐఆర్డిఏఐ చేసిన ప్రతిపాదనలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా బీమా ప్రీమియంలో పెరగడం లేదా ఏజెంట్ల కమిషన్ తగ్గడం జరగవచ్చు అన్న అంచనాలు వెలువడుతున్నాయి. జీవిత బీమా పాలసీదారులు గడువు కన్నా ముందే తమ పాలసీలను సరెండర్ చేసినప్పుడు మెరుగైన ప్రతిఫలాలు అందించడానికి సంబంధించి సవరించిన సరెండర్ వ్యాల్యూ మార్గదర్శకాలను ఈ ఏడాది తొలినాళ్లలో ఐఆర్డిఏఐ తెచ్చింది. ఇవి మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. కొందరు పాలసీదారులు పాలసీ గడువు ముగియడానికి ముందే తమ పాలసీని రద్దు చేసుకుంటారు. ఇలా చేయడాన్ని సరెండర్ అంటారు. పాలసీని సరెండర్ చేసినప్పుడు పాలసీదారుకు భీమా కంపెనీలు చెల్లించే మాత్రమే సరెండర్ విలువ. 

నేటి నుంచి అమలులోకి ఈ మార్పులు 

ఈక్విటీ (క్యాష్), డెరివేటివ్స్ (ఫ్యూచర్స్, ఆప్షన్స్) ట్రేడింగ్ లావాదేవీలకు సంబంధించిన ఫీజులను బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) లు మంగళవారం నుంచి మార్చుతున్నాయి. ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో సెన్సెక్స్, బ్యాంకెక్ ఆప్షన్స్ కాంట్రాక్టులకు కోటి ప్రీమియం టర్నోవర్పై ట్రాన్సాక్షన్ ఫీజును రూ.3,250 కి బీఎస్ఈ సవరించింది. ఇక క్యాష్ మార్కెట్ కు లావా దేవి రుసుమును లక్ష ట్రేడింగ్ విలువకు 2.97 గా ఎన్ఎస్ఈ నిర్ణయించింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్ సెక్యూరిటీ లావాదేవీ పన్ను (ఎస్టిటి) పెంపు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ పై ప్రస్తుతం ఉన్న 0.0125 శాతం, ఎస్టిటీని 0.2 శాతానికి పెంచారు. ఆప్షన్స్ ట్రేడింగ్ పై 0.0625 శాతం ఎస్టిటి ఉండగా, జీరో పాయింట్ వన్ శాతానికి పెంచనున్నారు. అక్టోబర్ 1 నుంచి బై బ్యాక్ సందర్భంగా షేర్లు అమ్మినప్పుడు వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది బై బ్యాక్ లో భాగంగా కంపెనీ తన వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది ఆదాయ పన్ను వివాదాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన వివాద్ సే విశ్వాస్ రెండో విడత పథకం మంగళవారం నుంచి అమల్లోకి రానుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్