గురుకులాలపై కక్ష ఎందుకు.. పడిపోతున్న గురుకులాల గౌరవం : కేటీఆర్

గురుకులాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కక్ష పెట్టుకుందని భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన సోమవారం స్పందించారు. గురుకుల విద్యార్థుల ఫోటోలను పోస్ట్ చేసిన ఆయన ఇది కక్ష్యా.? ఇది శిక్ష్యా? ఇది నిర్లక్ష్యమా ? అంటూ ప్రశ్నించారు. పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం ఏడాదిలోనే ఎందుకు పడిపోయిందనీ కేటీఆర్ ప్రశ్నించారు.

ktr

కేటీఆర్

గురుకులాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కక్ష పెట్టుకుందని భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన సోమవారం స్పందించారు. గురుకుల విద్యార్థుల ఫోటోలను పోస్ట్ చేసిన ఆయన ఇది కక్ష్యా.? ఇది శిక్ష్యా? ఇది నిర్లక్ష్యమా ? అంటూ ప్రశ్నించారు. పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం ఏడాదిలోనే  ఎందుకు పడిపోయిందనీ కేటీఆర్ ప్రశ్నించారు. గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి  ఒక్క గురుకుల పాఠశాలకు మాత్రమే పరిమితం చేసే కుట్ర దాగి ఉందా అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అభద్రతా భావం పెంచుతోందంటూ కేటీఆర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదిలోనే 50 మందికిపైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనీ కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రతిష్ఠాత్మకంగా సీఎం నుండి మంత్రుల వరకు కామన్ డైట్ అంటూ అట్టహాసంగా ప్రారంభించారని, అదంతా ఆరంభ శూరత్వమేనా అంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి పాలనలో దేశానికి ఆదర్శంగా గురుకులాలు నిలిచాయని, ఇప్పుడు అంతులేని నిర్లక్ష్యంతో అధ్వాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణమెవ్వరు అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గురుకులాల పట్ల నిర్లక్ష్య వైఖరిని ఎప్పటికైనా విడనాడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్