ఢిల్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమయ్యేనా.!

ఢిల్లీలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మరో సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఢిల్లీ ఎన్నికలు మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా హోరాహోరీ అన్నట్టుగానే వెల్లడించాయి. కొన్ని సంస్థలు బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పగా.. మరికొన్ని సంస్థలు ఆప్ కు పట్టం కట్టాయి. దీంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బుధవారం ఢిల్లీలోని 70 స్థానాలకు ఎన్నికలు జరగగా ఈనెల 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే పలు సంస్థలు తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెలువరించాయి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మరో సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఢిల్లీ ఎన్నికలు మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా హోరాహోరీ అన్నట్టుగానే వెల్లడించాయి. కొన్ని సంస్థలు బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పగా.. మరికొన్ని సంస్థలు ఆప్ కు పట్టం కట్టాయి. దీంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బుధవారం ఢిల్లీలోని 70 స్థానాలకు ఎన్నికలు జరగగా ఈనెల 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే పలు సంస్థలు తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెలువరించాయి. ఆయా సంస్థలు ఎవరికి అధికారాన్ని కట్టబెట్టే అవకాశం ఉంది అన్న అంశాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎగ్జాక్ట్ ఫలితాలు అవుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. 

ఇవి ఆయా సంస్థలు వెల్లడించిన ఫలితాలు 

పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు ఢిల్లీ ఫలితాలపై ఇచ్చిన అంచనాలను ఒకసారి పరిశీలిస్తే.. మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ సంస్థ.. ఆప్ 32-37 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. బిజెపికి 35 నుంచి 40 స్థానాలు వస్తాయని పేర్కొంది, కాంగ్రెస్ పార్టీకి 0-1 స్థానాలు వస్తాయని వెల్లడించింది. చాణిక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ఆప్ కు 25-28, బిజెపికి 39-44, కాంగ్రెస్ కు 2-3 సీట్లు వస్తాయని వివరించింది. పీపుల్స్ పల్స్ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీకి 10-19, బిజెపికి 51-60, కాంగ్రెస్ 00 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బి మార్గ్ ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఆప్ - 21-31, బిజెపి -39-49, కాంగ్రెస్ -01 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది. పోల్ డైరీ సంస్థ - ఆప్ - 18-25, బిజెపికి - 42-50, కాంగ్రెస్ - 00-02 స్థానాలు గెలుస్తాయని అంచనా వేసింది. పోల్స్ ఇన్ సైట్ ఆప్ -25-29, బీజేపీ - 40-44, కాంగ్రెస్ - 00-01 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. వీ ప్రిసైడ్ సంస్థ ఆప్ - 46-52, బిజెపికి - 18-23, కాంగ్రెస్ - 00-01 స్థానాలు గెలుస్తాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ జెవిసి సంస్థ - ఆప్ - 22-31, బిజెపి - 39-45, కాంగ్రెస్ - 00-02 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. మైండ్ బ్రింక్ ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఆప్ - 44-49, బిజెపి - 21-25, కాంగ్రెస్ - 00-01 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా కొన్ని బిజెపికి, మరికొన్ని కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టేలా ఫలితాలను వెల్లడించాయి. గతంలో హర్యానాలో కూడా అనేక సంస్థలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడుతూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఇచ్చాయి. అయితే ఆ అంచనాలు పూర్తిగా తప్పు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నట్టుగా బిజెపికి అధికారం దక్కుతుందా.? ఆప్ మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అన్నది రెండు రోజుల్లో తేలనుంది. ఇదిలా ఉంటే గడిచిన కొన్ని ఎన్నికల్లో సరిగ్గా అంచనా వేస్తూ ఎగ్జిట్ ఫలితాలను వెల్లడిస్తున్న ఏపీకి చెందిన కేకే సంస్థ ఢిల్లీలో ఆప్ మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. కేకే సర్వే వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఆప్ 44, బిజెపి 26 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఏపీ ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేసిన ఏకైక సర్వే సంస్థ ఇదే కావడం గమనార్హం. గడిచిన ఎన్నికల్లో కూటమి నేతృత్వంలోనే పార్టీలు 160కు పైగా స్థానాలు సాధిస్తాయని ఈ సంస్థ వెల్లడించింది. వైసిపి 15 స్థానాలకు లోపే పరిమితం అవుతుందని పేర్కొంది. ఈ సంస్థ చెప్పినట్లుగానే ఏపీలో ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కేకే సర్వే  సంస్థ అంచనాకు ప్రాధాన్యత ఏర్పడింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్