టిటిడి చైర్మన్ పదవి ఎవరికి దక్కేనో..! తీవ్రస్థాయిలో పలువురు నేతలు ప్రయత్నాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి కోసం ఓటమి పార్టీ నేతలు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా పోటీ చేసి రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీకి సంబంధించి ఆయా పార్టీల నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పలు నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి బంగపడిన ఎంతోమంది నేతలు తమకు ఎమ్మెల్సీలుగా అవకాశాలు దక్కుతాయని ఎదురుచూస్తున్నారు.

TTD temple

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి కోసం ఓటమి పార్టీ నేతలు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా పోటీ చేసి రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీకి సంబంధించి ఆయా పార్టీల నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పలు నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి బంగపడిన ఎంతోమంది నేతలు తమకు ఎమ్మెల్సీలుగా అవకాశాలు దక్కుతాయని ఎదురుచూస్తున్నారు. అలాగే మరి కొంతమంది నేతలు రాష్ట్రస్థాయిలో అత్యంత కీలకమైన టిటిడి చైర్మన్ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ పదవులు దక్కించుకునేందుకు టిడిపి, జనసేన, బిజెపిలోని ముఖ్య నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు తిరుపతి జిల్లాకు చెందిన కొంతమంది నేతలు కూడా ఈ పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎవరికి ఈ అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరికి ఈ పదవిని కట్టబెడతారు అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజుకు ఈ పదవి ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని నిర్ధారించకపోవడంతో తప్పుడు ప్రచారంగా మిగిలిపోయింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు టీటీడీ చైర్మన్ ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై కూడా స్వయంగా నాగబాబు బహిరంగ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ పదవిని టిడిపి తీసుకుంటుందో, కూటమి పార్టీలైన జనసేన, బిజెపికి అవకాశం కల్పిస్తుందో చూడాల్సి ఉంది. టీటీడీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బిజెపి ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తులకు టిటిడి చైర్మన్ పదవిని కట్టబెట్టాలనే డిమాండ్ ఉంది. బిజెపి గనుక టీటీడీ చైర్మన్ పదవిని కోరుకుంటే మాత్రం ఎవరైనా స్వామీజీకి ఈ పదవిని అప్పగించాలన్న యోచనలో బిజెపి అగ్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్