తెలుగు రాష్ట్రాల్లో బిజెపి కొత్త అధ్యక్షులు ఎంపిక ప్రక్రియను ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏపీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియామకం అవుతారు అన్నదానపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్య నాయకులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ జాబితాలో పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు బలంగా వినిపిస్తోంది. కొద్దిరోజుల కిందటి వరకు ఆయన రాజకీయంగా అస్త్ర సన్యాసం చేస్తారని అంతా భావించారు. కొద్దిరోజుల్లో తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని తానంటూ ప్రకటించారు కూడా.
సోము వీర్రాజు, సుజనా చౌదరి
తెలుగు రాష్ట్రాల్లో బిజెపి కొత్త అధ్యక్షులు ఎంపిక ప్రక్రియను ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏపీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియామకం అవుతారు అన్నదానపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్య నాయకులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ జాబితాలో పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు బలంగా వినిపిస్తోంది. కొద్దిరోజుల కిందటి వరకు ఆయన రాజకీయంగా అస్త్ర సన్యాసం చేస్తారని అంతా భావించారు. కొద్దిరోజుల్లో తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని తానంటూ ప్రకటించారు కూడా. అయితే అనూహ్యంగా బిజెపి అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టింది. దీంతో ఆయన మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యే పనిని ప్రారంభించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరు.. రేసులో పలువురు పేర్లు.?
తెలుగు రాష్ట్రాల్లో బిజెపి కొత్త అధ్యక్షులు ఎంపిక ప్రక్రియను ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏపీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియామకం అవుతారు అన్నదానపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్య నాయకులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ జాబితాలో పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు బలంగా వినిపిస్తోంది. కొద్దిరోజుల కిందటి వరకు ఆయన రాజకీయంగా అస్త్ర సన్యాసం చేస్తారని అంతా భావించారు. కొద్దిరోజుల్లో తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని తానంటూ ప్రకటించారు కూడా. అయితే అనూహ్యంగా బిజెపి అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టింది. దీంతో ఆయన మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యే పనిని ప్రారంభించారు. బిజెపి అగ్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలో సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టడంతో మరోసారి ఆయనకే పార్టీ బాధ్యతలను అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో పాటు అధిష్టానం వద్ద ఆయనకు మంచి పేరు ఉంది. ఇదే ఆయనకు మరోసారి పార్టీ పగ్గాలను అప్పగిస్తుందని చెబుతున్నారు.
అలాగే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా పార్టీ అధ్యక్ష పదవి కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కూడా ఈ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించి భంగపడిన ఉత్తరాంధ్రకు చెందిన పివిఎన్ మాధవ్ కూడా రేసులో ఉన్నారు. ఈయనకు కూడా ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉండడంతో పాటు పార్టీ ముఖ్య నాయకులకు సంబంధించి బలమైన సపోర్టు ఉంది. ఈ నేపథ్యంలో ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అదే సమయంలో కోస్త నుంచి సత్యనారాయణ, నెల్లూరు నుంచి సురేష్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. 2014 నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉండడంతో పాటు పార్టీ వాయిస్ను బలంగా ప్రజల్లోకి విష్ణువర్ధన్ రెడ్డి తీసుకు వెళుతున్నారు. యువకుడు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో పార్టీ అగ్రనాయకత్వం ఆయన వైపు కూడా దృష్టి సారిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి కోసం తెలంగాణకు చెందిన ఒక కేంద్రమంత్రి గట్టిగానే కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. బిజెపి మాజీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలను సాగిస్తున్నారు. జాతియ స్థాయి నాయకులతో ఈయనకు సత్సంబంధాలు ఉండడంతో ఈయనకు కూడా అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఆ పార్టీలో పలువురు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తుండడంతో ఎవరికి దక్కుతుందో అన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మరో వారం రోజుల్లో కొత్త బిజెపి అధ్యక్షుడు నియామకం పూర్తయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి ఆ అవకాశం ఎవరికీ దక్కుతుందో.