మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి సీఎంగా ఎవరని నిర్ణయిస్తుంది అన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత సీఎం, శివసేన చీఫ్ ఏక్ నాథ్ షిండేకు మళ్లీ సీఎంగా అవకాశం కల్పిస్తారా.? ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు అవకాశం దక్కుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కూటం శారద గానే కాకుండా అత్యధిక స్థానాలు నెగ్గిన పార్టీగా బిజెపికే అవకాశం దక్కుతుందని రాజకీయ విశ్లేషకులతోపాటు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి సీఎంగా ఎవరని నిర్ణయిస్తుంది అన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత సీఎం, శివసేన చీఫ్ ఏక్ నాథ్ షిండేకు మళ్లీ సీఎంగా అవకాశం కల్పిస్తారా.? ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు అవకాశం దక్కుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కూటం శారద గానే కాకుండా అత్యధిక స్థానాలు నెగ్గిన పార్టీగా బిజెపికే అవకాశం దక్కుతుందని రాజకీయ విశ్లేషకులతోపాటు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో మరోసారి దేవేంద్ర పడ్నవిస్ కు సీఎంగా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఈ మేరకు మిత్రపక్షలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎంగా ఉన్న ఏక్ నాథ్ షిండే ఈ విషయంలో కొంత ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. శివసేనతో విభేదించి బయటికి వచ్చి అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన తమకే అవకాశం కల్పించాలంటూ ఆయన వర్గం కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి తీవ్రంగా శ్రమించిన దేవేంద్ర ఫడ్నవిస్ వైపు బిజెపి అగ్రనాయకత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన్ను ఢిల్లీకి రావాలని అధిష్టానం పిలిచినట్లు సమాచారం. ఫడ్నవిస్ మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఎవరన్నది మహాయుతి నేతలంతా కలిసి నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఫలితాల అనంతరం షిండే, ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం ఎవరన్న దానిపై అసలు వివాదమే లేదన్నారు. దీనిపై చర్చించేందుకు సీఎం షిండేతో తాను, అజిత్ పవర్ ఆయన నివాసంలో భేటీ కానున్నట్లు వెల్లడించారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు సాఫీగా జరుగుతుందని సిండే కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతలు సమిష్టిగా ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై ఒక నిర్ణయాన్ని తీసుకొని బిజెపి అధిష్టానానికి ఆ పేరును సిఫార్సు చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఆదివారం మరోసారి ఈ ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఫడ్నవిస్ ఢిల్లీకి పయనమై వెళ్లారు. ఆయన అక్కడ నుంచి వచ్చిన తర్వాత మరోసారి ఈ ముగ్గురు నేతలు సమావేశం కానున్నారు. అయితే ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బిజెపి అగ్రనాయకత్వం ఫడ్నవిస్ కు ఏమి చెబుతుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. బిజెపి అగ్ర నాయకత్వం సూచనల మేరకు రాష్ట్రంలో ఫడ్నవీస్ ముందుకు వెళతారని చెబుతున్నారు. దీనిపై ఆదివారం ఒక స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాని ప్రకటన సోమవారం ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకోబోయే వ్యక్తిపై ఆదివారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా మహారాష్ట్ర ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన మహాయతి కూటమికి సీఎం అభ్యర్థిని ఖరారు చేయడం తలకు మించిన భారంగా మారుతోంది.