దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మహారాష్ట్ర ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఈనెల 20న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎవరి పక్షాన నిలుస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. మహారాష్ట్రలో ఎవరు అధికారంలోకి రావాలన్న ముంబై కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ అత్యధికంగా ఉన్న స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే.. ఆ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషణలు ఉన్నాయి.
మహారాష్ట్రలో పోటీ చేస్తున్న కీలక పార్టీల నేతలు
దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మహారాష్ట్ర ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఈనెల 20న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎవరి పక్షాన నిలుస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. మహారాష్ట్రలో ఎవరు అధికారంలోకి రావాలన్న ముంబై కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ అత్యధికంగా ఉన్న స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే.. ఆ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ముంబైలో 36 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో బిజెపి, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి అభ్యర్థులతో కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన, శరద్ పవర్ వర్గం ఎన్సీపీతో కూడిన మహా వికాస్ అఘాడీ కోటమి అభ్యర్థులు తలపడుతున్నారు. వీరికి తోడు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్), ప్రకాష్ అంబేద్కర్ సారధ్యంలోని వించిత్ బహుజన్ అఘాడీ, అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజిలీస్ అభ్యర్థులు ముంబైలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ ఎవరు మెజారిటీ స్థానాల్లో విజయం దక్కించుకుంటారు వారికే మహారాష్ట్ర పీఠం దక్కుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి.
గత లెక్కలు ఇలా
2019 సార్వత్రిక ఎన్నికల్లో ముంబైలోని 36 సీట్లకుగాను 30 స్థానాల్లో ఉమ్మడి శివసేన, ఎన్డీఏ కూటమి కైవసం చేసుకున్నాయి. ఇందులో బిజెపి 16, శివసేన 14 స్థానాలు గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో మహాయుతి కూటమిలోని బిజెపి 18, షిండే శివసేన 16, అజిత్ పవర్ ఎన్సిపి రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించాయి. ఎంబీఏ కూటమిలోని యూటీబి 22, కాంగ్రెస్ 11, శరద్ పవర్ వర్గం రెండుచోట్ల అభ్యర్థులను పోటీకి దించాయి. శివసేన రెండు ముక్కలై పరస్పరం పోటీ పడుతుండడంతో తాజా ఎన్నికల్లో ముంబై ఓటర్లు ఏ వర్గాన్ని ఆదరిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇది ఎలా ఉంటే 2024 లోక్సభ ఎన్నికల్లో ముంబైలోని ఆరు ఎంపీ సీట్లు గాను బిజెపి రెండింటిని గెలుచుకోగలిగింది. మిగిలిన నాలుగు స్థానాల్లో మూడింటిని ఉద్ధవ్ శివసేన గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ మరో స్థానాన్ని గెలుచుకుంది. మెజారిటీ నియోజకవర్గాలను గెలుచుకున్న ఎంబీఏ అదే ఊపులో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ముంబైలో 25 నియోజకవర్గాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దించారు. దీంతో సాంప్రదాయ ఓట్లు చీలే అవకాశం ఉంది. ముఖ్యంగా ముంబైలో సంప్రదాయ ఓట్లను నమ్ముకున్న బిజెపి, శివసేనలకు ఎంఎన్ఎస్ సవాలుగా మారనుంది. వర్లీలో ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే పోటీ చేస్తున్నారు. శివసేన తరపున మిలింద్ దేవర బరిలో ఉండగా, ఎంఎన్ఎస్ నుంచి సందీప్ దేశ్ పాండే పోటీ చేస్తున్నారు. ఈ ముక్కోనపు పోటీలో ఎవరు గెలుస్తారు అన్న ఆసక్తి నెలకొంది. చూడాలి ముంబై మరి ఎవరు పక్షాన నిలుస్తుందో.