మహరాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది. జార్ఖండ్‌లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించగా, జార్ఖండ్‌కు మాత్రం రెండో విడత పోలింగ్‌ను బుధవారం నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ ఫోల్ ఫలితాలను విడుదల చేశాయి.
ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు విడుదల
మహరాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది. మహరాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించగా, జార్ఖండ్‌కు మాత్రం రెండో విడత పోలింగ్‌ను బుధవారం నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ ఫోల్ ఫలితాలను విడుదల చేశాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు ఎన్‌డీఏకి జై కొట్టాయి. ఆయా సంస్థలు అందించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే.. మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్‌లో మహరాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీయే కూటమికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. ఈ సంస్థ ఫలితాల్లో బీజేపీ కూటమికి మహరాష్ట్రలో 150-170 స్థానాలు వస్తాయని అంచాన వేసింది.
కాంగ్రెస్ కూటమికి 110-130 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇతరలుకు ఎనిమిది నుంచి పది స్థానాలు రావచ్చని అంచనా వేసింది. కేకే సర్వే సంస్థ మహరాష్ట్రలో మహయుతి(ఎన్‌డీఏ) కూటమికి 225 స్థానాలు, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సంస్థ మహాయుతికి 175-196, మహావికాస్ అఘాడీకి 85-112 స్థానాలు వచ్చాయని అంచనా వేసింది. చాణక్య స్ర్టాటజీస్ మహాయుతికి 152-160, మహా వికాస్ అఘాడీకి 130-138 స్థానాలు వస్తాయని పేర్కొంది. లోక్‌శాహీ మరాఠీ - రుద్ర సంస్థ మహాయుతికి 128-142, మహావికాస్ అఘాడీకి 125-140 స్థానాలు వస్తాయని అంచాన వేసింది. ప్రీ మార్క్ సంస్థ మహాయుతికి 137-157 స్థానాలు, మహా వికాస్ అఘాడీకి 126-146 స్థానాలు, ఇతరులకు రెండు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేసింది. జార్ఖండ్ ఫలితాలకు సంబంధించి పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. చాణక్య స్ర్టాటజీస్ ఎన్‌డీయేకు 45-50, ఇండియా కూటమికి 35-38 స్థానాలు, పీపుల్ పల్స్ ఎన్‌డీయేకు 46-58 స్థానాలు, ఇండియా కూటమికి 24-37 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మ్యాట్రిజ్ సంస్థ ఎన్‌డీయే కూటమికి 42-47 స్థానాలు, ఇండియా కూటమికి 25-30 స్థానాలు, ఇతరులకు ఒకటి నుంచి నాలుగు స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్‌డీయే కూటమి అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో ఫలితాలను వెల్లడించాయి. మరి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ నెల 23 వరకు వేచి చూడాల్సిందే.