చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వల్ల యువత ఆత్మ న్యూనతా భావానికి గురవుతుంటారు. ఇటువంటి సమస్యతో బాధపడే వారికి చిన్నపాటి చిట్కాలను పాటించడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. హెన్నా పౌడర్ లో నిమ్మరసం కాఫీ లేదా టీ వేసి కలిపి ఆ పేస్ట్ ను తలకు, కుదుళ్ల నుంచి అప్లై చేయాలి. అరగంట తర్వాత వాష్ చేసుకుంటే తెల్ల రంగు మారుతుంది. ఉసిరికాయలను కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ నూనెను రెగ్యులర్ గా జుట్టుకు అప్లై చేసుకుంటే తెల్ల జుట్టు తగ్గుతుంది.
తెల్ల జుట్టు
గత కొన్నాళ్లుగా తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండానే జుట్టు తెల్లబడుతోంది. చాలామంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వల్ల యువత ఆత్మ న్యూనతా భావానికి గురవుతుంటారు. ఇటువంటి సమస్యతో బాధపడే వారికి చిన్నపాటి చిట్కాలను పాటించడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. హెన్నా పౌడర్ లో నిమ్మరసం కాఫీ లేదా టీ వేసి కలిపి ఆ పేస్ట్ ను తలకు, కుదుళ్ల నుంచి అప్లై చేయాలి. అరగంట తర్వాత వాష్ చేసుకుంటే తెల్ల రంగు మారుతుంది. ఉసిరికాయలను కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ నూనెను రెగ్యులర్ గా జుట్టుకు అప్లై చేసుకుంటే తెల్ల జుట్టు తగ్గుతుంది. రెగ్యులర్ గా ఈ నూనెతో మసాజ్ చేస్తే మెల్ నిన్ ఉత్పత్తి పెరిగి నల్లగా మారుతుంది. కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి మరిగించి దీనిని రోజు జుట్టుకు అప్లై చేయాలి. ఇది సహజంగా జుట్టు రంగును నలుపుగా మారుస్తుంది.
తలస్నానం చేసిన తరువాత జుట్టును కాపీ లేదా టీ డికాషన్తో కడగాలి ఓ అరగంట తరువాత చల్లని నీటితో దానిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టును ఇన్స్టెంట్ గా నల్లగా మారుస్తుంది. ఆవకాడోను అరటి పండులో కలిపి మాస్కుగా అప్లై చేసి దానిని స్కాల్స్ కు అప్లై చేస్తే జుట్టు పొడిబారడం తగ్గుతుంది. అలాగే తెల్లని జుట్టుని నల్లగా మార్చే గుణం దీనికి ఉంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా తెల్ల జుట్టు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటితోపాటు కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా తెల్ల జుట్టు సమస్యకు గురికాకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. వృత్తిపరమైన ఒత్తిళ్లకు దూరంగా ఉండటంతోపాటు జుట్టును కాలుష్యం బారిన పడకుండా ఉండేలా చేయాలని సూచిస్తున్నారు. నిపుణుల సలహాల మేరకు హెయిర్ మాస్కులు, కలర్స్ ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. చిన్న వయసులోనే తల నెరిసిపోవడం, మీసం, గడ్డం వైట్ గా మారిపోతుండడంతో చాలామంది యువత అసహనంలో కూరుకుపోతున్నారు. కొంతమంది అయితే బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇటువంటి ఇబ్బందులకు ఈ జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా చెక్ చెప్పవచ్చు.