జగన్ దారెటు.. ఇండియా కూటమి వైపా.! ఎన్డీఏ కూటమి వైపా.?

దేశంలో కొద్ది రోజుల్లో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తుంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన ఉంటుంది అన్న అంశం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలను ఆందోళన చెందేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల పార్టీలకు చెందిన నాయకులతో డి లిమిటేషన్ పై కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఇండియా కూటమి పక్షాలతో పాటు స్వతంత్రంగా ఉంటున్న కొన్ని రాజకీయ పార్టీలు నాయకులు హాజరయ్యారు. అయితే ఏపీలో కీలక పార్టీగా ఉన్న వైసిపి మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

YS Jaganmhona Reddy

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

దేశంలో కొద్ది రోజుల్లో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తుంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన ఉంటుంది అన్న అంశం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలను ఆందోళన చెందేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల పార్టీలకు చెందిన నాయకులతో డి లిమిటేషన్ పై కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఇండియా కూటమి పక్షాలతో పాటు స్వతంత్రంగా ఉంటున్న కొన్ని రాజకీయ పార్టీలు నాయకులు హాజరయ్యారు. అయితే ఏపీలో కీలక పార్టీగా ఉన్న వైసిపి మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపా.? ఎన్డీఏ పక్షాన ఉంటున్నారా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే జగన్ ఇండియా కూటమి వైపు ఉండాలి. ఎందుకంటే ఏపీలో అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమిలో భాగస్వామిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన బిజెపితో అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు దృష్ట్యా జగన్ ఇండియా కూటమి వైపు నిలబడతారని అంతా భావించారు. స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి కూడా డి లిమిటేషన్పై లేఖ రాశారు.  ఈ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ప్రతినిధులు హాజరవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా జగన్ పార్టీకి చెందిన ప్రతినిధులు ఎవరు ఈ సమావేశానికి హాజరు కాలేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి డి లిమిటేషన్పై తన వాయిస్ ను కూడా వినిపించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని లిమిటేషన్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై జగన్కు స్పష్టత లేకుండా పోయిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు ఎండీఏ కూటమి కాదనేసినప్పటికీ.. జగన్ ఇండియా కూటమి వైపు వెళ్లకుండా ఉండడం దేనికి సంకేతం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

దక్షిణాదికి నియోజకవర్గం విషయంలో అన్యాయం జరుగుతోందన్న వాదనతో నిర్వహించిన సమావేశానికి డీఎంకే నుంచి ప్రతినిధులు వచ్చి జగన్ ను కలిశారు. అప్పట్లో వారికి వస్తామా లేదా అన్న సమాచారాన్ని జగన్ ఇవ్వలేదు. చివరికి సమావేశానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రతినిధులు ఎవరు హాజరు కాలేదు. అయితే జగన్ తో సన్నిహితంగా ఉండే బిఆర్ఎస్ మాత్రం ఈ సమావేశంలో పాల్గొంది. ఈ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. కానీ జగన్ మాత్రం వెళ్లలేదు. స్టాలిన్కో జగన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2019లో జగన్ ప్రమాణస్వీకారానికి వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు స్టాలిన్ కూడా ఒకరు. అయినా స్టాలిన్ పిలుపునకు జగన్ స్పందించలేదు.  మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కొన్నాళ్ల కిందట ధర్నా చేశారు. ఈ ధర్నాకు మద్దతు ఇవ్వడానికి ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు వచ్చారు. టిడిపి పైన విమర్శలు చేశారు. కానీ జగన్ మాత్రం ఇండియా కూటమికి ఏ విషయంలోనూ మద్దతు ప్రకటించడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. గతంలో పార్లమెంట్లో ఏ విషయంలోనూ కాంగ్రెస్ కూటమికి సమర్ధించలేదు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందా లేదా అన్న అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల ఒకింత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ స్టాండ్ ఏమిటన్న దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. జగన్ ఎన్ డి ఏ పక్షాన ఉంటున్నారా..? ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తారా.? అన్న ప్రశ్నలు పన్నమవుతున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్