తెలుగు నెలలో చివరి మాసం ఫాల్గుణ మాసం. కాబట్టి ఈ ఏడాది చివరి అమావాస్య ఎప్పుడూ అన్నదానపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనిపై పండితులు ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి అమావాస్య ఈనెల 29న రానుంది. మార్చి 29న ఈ అమావాస్య వస్తుందని పండితులు వెల్లడించారు. ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం రెండు 20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. ఇది పాల్గొనమాసం కృష్ణపక్ష అమావాస్య రోజున సంభవించే పాక్షిక సూర్యగ్రహణంగా నిపుణులు చెబుతున్నారు. గ్రహణం సందర్భంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణకాలంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటి.? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్న దానిపై అనేక అనుమానాలు అందరిలో ఉంటాయి.
సూర్యగ్రహణం
తెలుగు నెలలో చివరి మాసం ఫాల్గుణ మాసం. కాబట్టి ఈ ఏడాది చివరి అమావాస్య ఎప్పుడూ అన్నదానపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనిపై పండితులు ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి అమావాస్య ఈనెల 29న రానుంది. మార్చి 29న ఈ అమావాస్య వస్తుందని పండితులు వెల్లడించారు. ఈ గ్రహణం మీనరాశిలో సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఈ ఏడాది మొదటి పాక్షిక సూర్యగ్రహణం యూరప్, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, బార్బడోస్, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, బెర్ముడా, ఫిన్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్ల్యాండ్, హాలండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, ఉత్తర రష్యా, స్పెయిన్, ఉత్తర అమెరికా తూర్పు ప్రాంతాలు, ఇంగ్లాండ్ మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తుంది.
ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం రెండు 20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. ఇది పాల్గొనమాసం కృష్ణపక్ష అమావాస్య రోజున సంభవించే పాక్షిక సూర్యగ్రహణంగా నిపుణులు చెబుతున్నారు. గ్రహణం సందర్భంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణకాలంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటి.? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్న దానిపై అనేక అనుమానాలు అందరిలో ఉంటాయి. అయితే భారతదేశంలో కనిపించదు కాబట్టి సూత కాలం అంటూ మనకు ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తెలుగు నెలలో చివరి మాసంలో వస్తున్న ఆఖరి అమావాస్య కావడంతో దీనిపట్ల సర్వత్ర ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే భారతదేశంలో దీని ప్రభావం అంతగా ఉండదని, సూర్యగ్రహణం అసలు కనిపించదని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు అన్న అభిప్రాయాన్ని కొలువురు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది మాత్రం దీనిపై కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణకాలంలో ఎలా ఉండాలి అన్న ప్రశ్నలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కానీ జ్యోతిష్య పండితులు మాత్రం దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.