|| ప్రతీకాత్మక చిత్రం ||
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో వాట్సాప్ మెసేంజర్ ఉంటూనే ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా మంది వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేట్టుగా వాట్సప్ కొత్త కొత్త ఫ్యూచర్ ని అందుబాటులో తీసుకోస్తుంది. తాజాగా చాట్, గ్రూప్ చాట్‌లలో వినియోగదారులు మెసేజ్‌లను పిన్ చేసుకునే వీలు కల్పించనుందని వాబేటాఇన్‌ఫో నివేదిక వెల్లడించింది. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని త్వరలో అప్ డేట్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
ఈ ఫీచర్ వలన ముఖ్యమైన మెసేజ్లను పిన్ చేసుకొనే వీలుంటుంది. అలాగే పిన్ చేసిన మెసేజ్ లను చాటింగ్ టాప్ లో పెట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా గ్రూప్ లో ఉన్న వ్యక్తులు కొత్త వర్షన్ అప్ డేట్ చేసుకొని లేకపోతే వ్యక్తులకు ఫిన్ చేసిన మెసేజ్ తో కొత్త వర్షన్ అప్డేట్ చేసుకోమని సూచన ఇస్తుంది. ఇలా కొత్త అప్ డేట్స్ చేసుకోవడం వల్ల ముఖ్యమైన మెసేజ్లను చాటింగ్ లో టాప్ లో ఉంచుకోవచ్చు.