మంత్రి ఆనం ఆరోపణల్లో నిజమెంత.. సీసీ ఫుటేజీ విడుదలలో జాప్యం ఎందుకు.!

జగన్మోహన్ రెడ్డి పరామర్శ తర్వాత రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన బాధితుల్లో చాలామంది విమర్శలు చేయడం వెనుక వైసీపీ నాయకులు తెల్ల కవర్లు పంపిణీ చేయడమే కారణంగా ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టించాయి. తెల్ల కవర్లు ఎవరు పంచారు, ఎవరికి పంచారు అన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ ఇది పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. వైసీపీకి చెందిన ఒక పెద్ద నాయకుడు ముందుగా జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్న బాధితులు వద్దకు వెళ్లి తెల్ల కవర్లలో డబ్బులు పెట్టి ఇచ్చారన్నట్టుగా ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు.

Scenes of stampede in Tirupati

తిరుపతిలో తొక్కిసలాట దృశ్యాలు

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు టోకెన్ల జారీ వద్ద చోటు చేసుకున్న తొక్కిసిలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 30 మంది వరకు ఈ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఆసుపత్రుల్లో గాయపడే చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అయితే జగన్మోహన్ రెడ్డి పరామర్శ తర్వాత రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన బాధితుల్లో చాలామంది విమర్శలు చేయడం వెనుక వైసీపీ నాయకులు తెల్ల కవర్లు పంపిణీ చేయడమే కారణంగా ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టించాయి. తెల్ల కవర్లు ఎవరు పంచారు, ఎవరికి పంచారు అన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ ఇది పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. వైసీపీకి చెందిన ఒక పెద్ద నాయకుడు ముందుగా జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్న బాధితులు వద్దకు వెళ్లి తెల్ల కవర్లలో డబ్బులు పెట్టి ఇచ్చారన్నట్టుగా ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. ఆ కవర్లు తీసుకున్న వాళ్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి కూటమికి చెందిన నేతలు కుట్ర కోణాన్ని కూడా బయటకు చెబుతున్నారు. కుట్ర కోణం దాగి ఉందా అనే విధంగా కూడా విచారణ సాగుతుందని హోం మంత్రి అనిత కూడా స్పష్టం చేశారు. వీటిని బలపరిచేలా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కవర్ల పంపిణీ వ్యవహారాన్ని బయటపెట్టారు. అక్కడ ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని వెల్లడించినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను వైసీపీ సీరియస్ గానే తీసుకుంది. ఈ తరహా ఆరోపణలు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని వైసిపి ఆరోపిస్తోంది. ఈ తరహా తప్పుడు ఆరోపణలు సరికాదన్న వైసీపీ.. దానికి సంబంధించిన సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేసింది. లేదంటే పదవి నుంచి తప్పుకోవాలని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చాలెంజ్ ఇచ్చారు.

పక్క ఆధారాలతోనే వైసిపి కవర్లు కహాని బయట పెట్టారని టిడిపి నేతలు చెబుతున్నప్పటికీ అందుకు అనుగుణమైన ఆధారాలను వెల్లడించకపోవడం గమనార్హం. ఆనం చెబుతున్న కవర్ స్టోరీ కూడా డైవర్షన్ టాక్టీస్ లో భాగంగానేనని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు గాయపడిన బాధితులను ఆసుపత్రి నుంచి పంపించేందుకు ఏర్పాటులు కూడా చేశారని ఆరోపిస్తోంది. అందుకు అనుగుణంగా వాహనాలను కూడా సిద్ధం చేశారని చెబుతున్నారు. అసలు ఆసుపత్రి వరకు వెళ్లకుండా ట్రాఫిక్ జామ్ అయ్యేలా ప్రభుత్వం చేసిందన్న ఆరోపణలు కూడా వైసిపి చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి వెళ్లేందుకు మార్గం లేకుండా చేయడమే దీని ఉద్దేశం అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్రంగా మారిపోవడం ఘమనార్హం. ఈ తరహా జరగకుండా చూస్తామని చెప్పాల్సిన నేతలు విమర్శలు చేయడం సరికాదని పలువురు సూచిస్తున్నారు. ఒకవేళ కుట్ర కోణం దాగి ఉంటే విచారణ చేసి నిరూపించడం ద్వారా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అంతేగాని అక్కడ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకున్న ప్రయత్నం చేయడం సమంజసం కాదని పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్