భారతీయుడు-2 సినిమా విడుదలకు సంబంధించిన వివాదం జరుగుతోంది. ఈ సినిమాలో మర్మకళకు సంబంధించిన అంశం ఈ వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో మర్మకళ అంటే ఏమిటి..? ఈ కళను ఎందుకు, ఎలా వినియోగిస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మర్మకళ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చదివేయండి. మర్మకళ అనేది ప్రచీన భారత రహస్య యుద్ధ విద్యల్లో ఒకటిగా చెబుతారు.
మర్మ కళ ప్రయోగం
భారతీయుడు-2 సినిమా విడుదలకు సంబంధించిన వివాదం జరుగుతోంది. ఈ సినిమాలో మర్మకళకు సంబంధించిన అంశం ఈ వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో మర్మకళ అంటే ఏమిటి..? ఈ కళను ఎందుకు, ఎలా వినియోగిస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మర్మకళ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చదివేయండి. మర్మకళ అనేది ప్రచీన భారత రహస్య యుద్ధ విద్యల్లో ఒకటిగా చెబుతారు. ఈ విద్య ఎక్కువగా కేరళ కనిపిస్తుంటుంది. దీన్ని వర్మ కళ అని కూడా చెబుతుంటారు. ఈ యుద్ధ కళకు మదగాంబీ అయ్యర్‌ను ఆద్యుడిగా పేర్కొంటారు. ఈ మర్మ కళ కేరళలో పుట్టి వారి సాంప్రదాయక యుద్ధకళగా వెలుగొందుతూ వచ్చింది. ఈ కళలోని మర్మాలు అత్యంత నైపుణ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతారు. దీనిలోని ప్రక్రియలు ముఖ్యంగా శక్తి ఔపాసనా క్రియలు బలమైనవి. సూత్రాలు శక్తివంతమైనవి. బంధన విద్య జ్ఞానవంతమైనది. మర్మ విద్య సూక్ష్మమైనదిగా చెబుతారు. ఆయుధ విద్య తేజోవంతమైనది. మొత్తంగా చూసుకుంటే ఇది ఉత్తమమైన ఆత్మరక్షణ కళగా చెప్పవచ్చు.
దొంగలను ఎదుర్కొనేందుకు..
గతంలో రాజులు నాటి కాలంలో దొంగలు బెడద ఎక్కువగా ఉండేది. రాజ్యాలు రక్షణలో కీలకంగా వ్యవహరించే సైనికులు దోపిడీ దొంగలు బారి నుంచి రాజ్యాన్ని కాపాడడం ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా దొంగలు యుద్ధ విద్యల్లో ఆరి తేరి ఉండడంతో సైనికులకు వారితో పోరాటం చేయడం తలకు మించిన భారంగా ఉండేది. ఇటువంటి ఇబ్బందులను, దొంగలు నుంచి రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో అయ్యర్ మదిలో నుంచి పుట్టిన ఆలోచన మర్మ కళ. ఈ మర్మ కళలో యుద్ధ మెళుకువలతోపాటు ఆయుర్వేదం, యోగ, గ్రస్వ, తింగి వంటి ఆరోగ్య పద్ధతులను నేర్పించేవారు. ఈ సాధన ఎంత కష్టమైనా ఇష్టం ఉన్న వాళ్లు ఆసక్తిగా నేర్చుకునేవాళ్లు. అయితే, ఈ మర్మకళ యుద్ధ విద్యలో జాడగాపి, తంబీ అయ్యర్, సుక్రీ చోళ, అరుణ పాండ్యన్, తోగి అయ్యర్, సుదీప చేర ఉద్ధండులుగా ఎంతో ఘనకీర్తిని దక్కించుకున్నారు.
యుద్ధ విద్య.. వైద్య విద్య కూడా..
మర్మ కళ అన్నది యుద్ధ విద్య మాత్రమే కాదు.. వైద్య విద్య కూడా. ఆయుర్వేదంలో అడ్వాన్స్‌డ్ వైద్యంగా దీన్ని చెబుతుంటారు. మర్మ కళతో క్షణాల్లోనే ఎదుటి వ్యక్తిని చంపేయనూ గలరు. అంతే క్షణాల్లో ఎదుటి వ్యక్తి శరీరంలోని అవయవాల్లో ఉన్న లోపాలను నయమూ చేయగలరు మర్మ కళ నిపుణులు. రెండు వేళ్లతోనే ఈ యుద్ధ, వైద్య పద్ధతలను అమలు చేస్తారు. శీరరంలోని పాడైన అవయవాలను క్షణాల్లోనే పని చేసేలా ఈ మర్మకళ విద్యతో చేస్తారు. అదే సమయంలో శరీరంలోని భాగాలను పని చేయకుండానూ చేస్తారు. ఈ విద్య తెలిసిన వారికి ఎక్కడ నొక్కితే వారికి ఉన్నసమస్య తీరుతుందో స్పష్టంగా తెలుస్తుంది. మెడ, బ్రెయిన్, మోకాళ్లు, గుండె కండరాలు.. ఇలా ఎక్కడ సమస్య ఉన్నా.. దాన్ని క్షణాల్లోనే ఒక్క క్లిక్ చేయడం ద్వారా పరిష్కరించే నైపుణ్యం ఈ మర్మకళ ద్వారా సాధ్యపడుతుంది. అందుకే మర్మకళను అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ మెడిసిన్‌గా కూడా చెబుతున్నారు. అదే సమయంలో యుద్ధకళగానూ దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే రెండు చేతులతో ఎక్కడ నొక్కి పెట్టడం ద్వారా ఆయా అవవయాలు పని చేయకుండా చేయవచ్చనో ఈ విద్యలోని నిపుణులకు తెలుసు. ఒకచోటకు బదులు ఒకచోట నొక్కినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటారు.
అతికొద్ది మంది మాత్రమే..
దేశంలో మర్మకళ తెలిసిన వారు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారని చెబుతుంటారు. ఈ విద్యను నేర్చుకునే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో భవిష్యత్ తరాలకు దీని గురించి తెలియకుండా పోతోంది. గతంలో భారతీయుడు సినిమాతో బయటి ప్రపంచానికి దీని గురించి విస్తృతంగా తెలిసింది. మళ్లీ ఇప్పుడు భారతీయుడు 2 సినిమా ద్వారా మరోసారి దీనిపై చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఒకే విద్యతో ఆత్మరక్షణను పొందడంతోపాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని పొందడం మర్మకళతో మాత్రమే సాధ్యం కావడం గమనార్హం.