||ప్రతీకాత్మక చిత్రం|| ఆంగ్ల సంవత్సరంలో మొదటిగా వచ్చే సంక్రాంతి పండుగ. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ.. అందులో వచ్చే మొదటి రోజే "భోగి పండుగ" ఈరోజు భోగి పళ్ళు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోయడం వల్ల పిల్లలకు శాస్త్రీయంగా వారి శరీరం అలాగే చెడు కళ్ళు వారిపై పడకుండా అనారోగ్యానికి గురవుతారని భోగి పళ్ళను పోస్తారు. ఇది వాస్తవానికి వస్తే 'దిష్టి'ని నివారించే మార్గం పిల్లలపై ఉండే చెడు దృష్టిని తీసేసి మార్గమని చెప్పుకోవచ్చు.
ఈరోజు ఏమి చేయాలి?
ఈరోజు ఉదయాన్నే పిల్లలకు తలంటు స్నానం చేయించి కొత్త బట్టలు అంటే సాంప్రదాయమైన బట్టలు ధరింపజేసి సూర్యాస్తమయానికి భోగి పళ్ళు పోసేందుకు సిద్ధంగా ఉంచాలి. మధ్యాహ్నం భోగి పళ్ళు పోసేందుకు అవసరమైన సన్నహాలను తయారు చేసుకోవాలి. అలాగే పేరంటానికి వృద్ధులను, ఇరుగుపొరుగు వాళ్లను పిలిచి పిల్లలపై భోగి పళ్ళు పోయించడం వల్ల మంచి జరుగుతుందన్న నమ్మకం.
భోగి పళ్ళు పోసేందుకు ఏం కావాలి?
ఒక గిన్నెలో రంగురంగుల పువ్వులు, కరెన్సీ నాణేలు, రేగు పళ్ళు, చిన్నచిన్న చెరుకు ముక్కలు, ఒకరోజు ముందే నానబెట్టిన శనగలు, ఆమె/అతడిని కూర్చోబెట్టడానికి కుర్చీని తీసుకొని అందులో పట్టు చీర/పట్టు గుడ్డను వేసి తయారు చేసి ఉంచుకోవాలి. అలాగే పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, అక్షింతలు, హారతి పళ్లెం, పేరంటానికి వచ్చిన వాళ్లకు వాయినం ఇవ్వడానికి తాంబూలం తయారు చేసుకుని ఉంచుకోవాలి.
భోగి పళ్ళు ఎలా పోయాలి?
సూర్యాస్తమయానికి ముందు పిల్లల కోసం తయారుచేసిన కుర్చీ పైన తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. పిల్లల నుదుటికి బొట్టు పెట్టి, మెడ పైన గంధం పెట్టి, చేతుల నిండా భోగిపళ్ళను తీసుకొని ఒకసారి కుడి వైపుగా ఇంకోసారి ఎడమవైపుగా తిప్పి పిల్లల తలపై నుండి పోయాలి. ఇలా పేరంటానికి వచ్చిన అందరూ పోసిన తర్వాత పిల్లలకి హారతి సమర్పించి హారతి పాటలు పాడాలి. తర్వాత పేరంటానికి వచ్చిన అందరికీ తాంబూలం ఇచ్చి పంపించాలి. భోగి పళ్ళను చిన్నపిల్లలు స్వీకరించకుండా చూడాలి. తర్వాత నేల పై పడిన భోగి పండ్లను సేకరించి ఒక సంచిలో వేసి సంక్రాంతి తర్వాత సోమ, బుధ, శని, ఆదివారాల్లో దూరంగా విస్మరించవచ్చు. అందులో ఉన్న నాణేలను ఎవరికైనా పేదవారికి దానం చేయవచ్చు.