సమతుల ఆహారం అంటే ఏమిటి..? బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులు సమతల ఆహారం తీసుకోవచ్చా.!

సమతుల ఆహారం అంటే శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలను తగు పాళ్లలో అందించే ఆహారం. సమతుల ఆహారం అంటే శరీరానికి అవసరమయ్యే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు మొదలైన పోషకాలను అందించాలి. మనం తీసుకునే ఆహారం నుండి వచ్చే పోషకాలు, క్యాలరీలు శరీరంలోని అన్ని జీవ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి అవసరం అవుతాయి. సగటు వ్యక్తికి రోజు సుమారు 2000 క్యాలరీల అవసరం. ఈ మొత్తం వారి వయస్సు, లింగం, శారీరక శ్రమ స్థాయిని బట్టి ఉంటుంది.

balanced diet

సమతుల ఆహారం

గత కొన్నాళ్లుగా అనేక వ్యాధులు ప్రజలను ముప్పేట దాడి చేస్తున్నాయి. యుక్త వయస్కులు కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. క్యాన్సర్, జబ్బులు వంటివి అన్నీ వయసుల వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ తరహా వ్యాధులకు, ఇతర అనారోగ్య సమస్యలకు ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు కారణంగా చెబుతున్నారు. ఈ తరహా వ్యాధులకు చెక్ చెప్పాలంటే తప్పనిసరిగా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలు సమతుల ఆహారం అంటే ఏమిటి, ఈ సమతుల ఆహారాన్ని బీపీ, షుగర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడే రోగులు తీసుకోవచ్చా అన్న విషయాలను తెలుసుకుందాం. 

సమతుల ఆహారం అంటే శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలను తగు పాళ్లలో అందించే ఆహారం. సమతుల ఆహారం అంటే శరీరానికి అవసరమయ్యే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు మొదలైన పోషకాలను అందించాలి. మనం తీసుకునే ఆహారం నుండి వచ్చే పోషకాలు, క్యాలరీలు శరీరంలోని అన్ని జీవ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి అవసరం అవుతాయి. సగటు వ్యక్తికి రోజు సుమారు 2000 క్యాలరీల అవసరం. ఈ మొత్తం వారి వయస్సు, లింగం, శారీరక శ్రమ స్థాయిని బట్టి ఉంటుంది. మగవారికి ఆడ వారికంటే ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి. వ్యాయామం చేసే వారికి కూడా ఎక్కువ క్యాలరీలు అవసరమే. అదే శారీరక శ్రమ తక్కువగా ఉండి ఎక్కువసేపు కూర్చొని ఉండేవారికి క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అవసరం కూడా తక్కువే. ప్రత్యేకించి ఒక పోషక పదార్థం కోసం అంటే కేవలం ప్రోటీన్ కోసం ప్రోటీన్ షేక్స్ తీసుకోవడం, విటమిన్ కోసం సప్లిమెంట్ల మీద ఆధారపడడం కాకుండా ఈ పోషకాలు అన్ని వీలున్నంతవరకు రోజువారీ తీసుకునే ఆహారంలో లభ్యమయ్యేలా చూసుకోవాలి. సమతుల్యమైనది కావాలంటే వివిధ రకాల ధాన్యాలు, పప్పులు, గింజలు, కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పాలు పదార్థాలు, పాలు దినసరి ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. రోజువారి ఆహారంలో ఇవన్నీ ఉన్నట్టయితే వారికి సమతుల ఆహారం లభించినట్టు అవుతుంది. ఇక 70 ఏళ్లు పైబడిన, బిపి, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. వీరు రోజువారీ తీసుకునే ఆహారంలో ఉప్పు తగ్గించడం, ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. జీవన శైలికి తగిన ఆహారపు జాగ్రత్తల కోసం నిపుణుల సలహా తీసుకొని పోషక లోపం రాకుండా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు. నిపుణుల సూచనలతో తగిన ఆహారపు అలవాట్లను చేసుకోవడం  ద్వారా పోషకాహార లోపం లేకుండా కాపాడుకోవచ్చు. 

ఉరుకుల పరుగుల జీవితంలో సమతుల ఆహారాన్ని తీసుకోవడం అనే విషయాన్ని చాలా మంది మర్చిపోయారు. ఆకలి వేస్తే సమయానికి ఏదో ఒకటి తినేయడం, తాగేయడం ద్వారా కడుపు నింపుకుంటున్నారు తప్పితే శరీరానికి అవసరమైన పోషకాలను అందించాలని విషయాన్ని మర్చిపోతున్నారు.  దీనివలన ఎంతోమంది యువకులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపాలు వల్ల దీర్ఘకాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎముకుల సంబంధిత సమస్యలు వంటివి చిన్న వయసులోనే ఇబ్బందులకు గురి చేయవచ్చని పేర్కొంటున్నారు. కాబట్టి ప్రతిరోజు తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్