డ్రై ఫ్రూట్స్ లో రోజు తీసుకోవాల్సినవి ఏవి.. ఒకే లాంటి పోషకాలు ఉంటాయా..?

శరీరానికి అవసరమైన పోషకాలు లభించాలంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ కూడా మోతాదుకు మించి తీసుకోకూడదు అన్నది నిపుణులు మాట. ఎటువంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఏఏ పోషకాలు అందుతాయి అన్నది చాలా మందికి తెలియదు. సాధారణంగా డ్రై ఫ్రూట్స్ అని పిలిచే వాటిల్లో బాదం, ఆక్రోట్, జీడిపప్పు, పిస్తా లాంటి గింజలను చేరుస్తాం.

Dry fruits

డ్రై ఫ్రూట్స్

శరీరానికి అవసరమైన పోషకాలు లభించాలంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ కూడా మోతాదుకు మించి తీసుకోకూడదు అన్నది నిపుణులు మాట. ఎటువంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఏఏ పోషకాలు అందుతాయి అన్నది చాలా మందికి తెలియదు. సాధారణంగా డ్రై ఫ్రూట్స్ అని పిలిచే వాటిల్లో బాదం, ఆక్రోట్, జీడిపప్పు, పిస్తా లాంటి గింజలను చేరుస్తాం. నిజానికి డ్రై ఫ్రూట్స్ అంటే కేవలం ఎండ బెట్టిన పండ్లు మాత్రమే. అంటే ఎండు ద్రాక్ష, ఎండిన అంజీర పండ్లు, ఎండిన ఆల్బక్రా పండు, ఎండు ఖర్జూరం మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. వీటిని మాత్రమే డ్రై ఫ్రూట్స్ గా చెబుతారు. ఎండిన పండ్లలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. చక్కెర అధికంగా ఉంటుంది.

సాధారణ ఆరోగ్యవంతులు రోజుకు 10 నుంచి 15 గ్రాములకు మించకుండా వీటిని తీసుకోవచ్చు. 15 గ్రాములకు మించి తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక బాదం, ఆక్రోట్, జీడిపప్పు, పిస్తా లాంటి గింజల విషయానికొస్తే వీటిల్లో కొవ్వు పదార్థాలు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటిలో అధిక భాగం అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఉండడం వల్ల గుండెకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ గింజల్లో కొంచెం ప్రోటీన్, పీచు పదార్థాలు ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, సెలీనియం లాంటి పోషకాలు కూడా ఈ గింజల్లో ఉంటాయి. చాలా పోషకాలు ఉన్నప్పటికీ క్యాలరీలు బాగా ఎక్కువ కాబట్టి సాధారణ ఆరోగ్యవంతులు వీటిని రోజుకు 30 గ్రాములకు మించి తీసుకోకపోవడం మేలు. ఇక మొలకెత్తిన గింజల్లో కాస్త నీళ్లు, కొద్దిపాటి పిండి పదార్థాలు, మాంస కృతులు ఉంటాయి. కొవ్వులు చాలా తక్కువ, క్యాలరీలు కూడా చాలా తక్కువ. కాబట్టి వీటిని నట్స్ తో పోల్చడం సరికాదు. ఒక దానికి ఒకటి ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి ఈ విషయంలో తగిన స్పష్టత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఎంతో మంది డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటాము అన్న ఉద్దేశంతో పరిధికి మించి తీసుకుంటుంటారు. దీనివల్ల ప్రయోజనం ఉండదని న్యూట్రీషియనిస్టులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్