ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలతో విడుదల చేసిన బడ్జెట్లో కొన్ని సంక్షేమ పథకాలకు నిధులను కూడా కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే చిన్నారులకు పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. అలాగే రైతులకు రైతు భరోసా పథకాన్ని కూడా ఈయాడాదే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సంక్షేమ పథకాలు అందుతాయన్న ఆనందాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలతో విడుదల చేసిన బడ్జెట్లో కొన్ని సంక్షేమ పథకాలకు నిధులను కూడా కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే చిన్నారులకు పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. అలాగే రైతులకు రైతు భరోసా పథకాన్ని కూడా ఈయాడాదే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సంక్షేమ పథకాలు అందుతాయన్న ఆనందాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్ లో భాగంగా కొన్ని పథకాలు అయినా అందుతాయని ఆత్రుతగా ఎంతోమంది చూస్తున్నారు. అయితే అటువంటి వారికి షాక్ ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోవుతోందా అంటే అవునన్న సమాధానమే కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. రెండు రోజుల కిందట ఒక సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీకి అనుకూలంగా ఉన్నవారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాన్ని అందించకూడదంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా ఉన్నవారికి సంక్షేమ పథకాలు ఇవ్వను అంటే ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కోటి 30 లక్షల మంది వరకు వైసిపికి ఓట్లు వేశారు. వారందరికీ సంక్షేమ పథకాలను అందించరా అన్నది ఇక్కడ ప్రశ్నగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీకి చెందిన వ్యక్తులకి ఎటువంటి స్థాయిలో కూడా సహకారాన్ని అందించకూడదని పేర్కొన్నారు. ఆయన ఉద్దేశం బిల్లుల విషయంలోనా లేక ప్రభుత్వపరంగా అమలు చేసే సంక్షేమ పథకాలు విషయంలోనా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన తర్వాత సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంటే.. వైసీపీ సానుభూతిపరులు దగ్గర నుంచి పన్నులు కూడా వసూలు చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ తరహా పక్షపాత ధోరణితో మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాలు వేదికగా ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కూటమి స్టాండ్ ఇదేనా.!
సీఎం చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అన్నదానిపై ఇప్పటికి స్పష్టత లేదు. ఇదే స్టాండ్ ను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ వైసీపీ సానుభూతిపరులకు సంక్షేమ పథకాలను అందించకూడదు అనే నిర్ణయం తీసుకుంటే మాత్రం క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకపోతే క్షేత్రస్థాయిలో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది అన్న భావన ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతుంది. మరి దీనిపై కూటమి నాయకులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వైసిపి శ్రేణులకు సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కట్టడి చేస్తారా లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలుతుంది.