విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలి.. ఎంపీలతో వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. శుక్రవారం ఆ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలతో సమావేశమైన ఆయన.. కీలక సూచనలు చేశారు. వైసీపీ పాలనను, చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఖచ్ఛితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని జగన్‌ వ్యక్తం చేశారు.

YS Jagan meeting with MPs

ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్


రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. శుక్రవారం ఆ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలతో సమావేశమైన ఆయన.. కీలక సూచనలు చేశారు. వైసీపీ పాలనను, చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఖచ్ఛితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని జగన్‌ వ్యక్తం చేశారు. ఈలోగా ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలని పార్టీ ఎంపీలకు దిశా, నిర్ధేశం చేశారు. గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పాలన చేశామని, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను 99 శాతం అమలు చేశామన్నారు. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన కొవిడ్‌ వంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశామన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడూ చూడని సంస్కరణలు తీసుకువచ్చామని, ప్రజలు ఇంటి వద్దకే పాలన అందించామన్నారు. అవినీతికి చోటు లేకుండా, వివక్ష చూపకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశామని, ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందించామన్నారు. సంస్కరణలతో పేదరికం నిర్మూలన దిశగా అడుగులు వేశామన్న జగన్‌.. భవిష్యత్‌ తరాలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఇంగ్లీష్‌ మీడియం, టోఫెల్‌, ఆరో తరగతి నుంచి డిజిటల్‌ టీవీలు, ఎనిమిదో తరగతి నుంచి ట్యాబ్‌లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐబీ సిలబస్‌ను కూడా తీసుకువచ్చామని, ప్రఖ్యాత వర్శిటీలు కోర్సులను విద్యార్థులకు అందించామన్నారు. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా పేదరికం నిర్మూలన దిశగా ఐదేళ్లలో అడుగులు వేసినట్టు ఆయన తెలిపారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, దీనికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ తీసుకువచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్ధతు పలికిందన్నారు. అమెరికా, యూరప్‌ వంటి దేశాల్లో అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని సభ సాక్షిగా ప్రశంసలు కురిపించిన విషయాన్ని జగన్‌ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇదే యాక్ట్‌ను టీడీపీ భూతంలా చూపించిందన్నారు. మద్ధతు పలికిన టీడీపీ ఇప్పుడు తీసేస్తామని చెబుతోందని, వారి ఎలా రాజకీయాలు ఎలా ఉంటాయో దీన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. వైసీపీకి 15 మంది ఎంపీలు ఉన్నారని, పార్టీ బలంగా ఉందని, ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ప్రజల తరఫున పోరాటం చేయాలని సూచించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డిని ఎన్నుకున్నట్టు జగన్‌ ప్రకటించారు. రాజ్యసభలో పార్టీ నేతగా విజయసాయిరెడ్డి, లోక్‌సభలో మిథున్‌ రెడ్డి వ్యవహరిస్తారన్నారు. 



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్