వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా దూసుకుపోతున్నారు. ఐదు లక్షలకుపైగా మెజారిటీ సాధించేట్టుగా ఆమెకు రౌండ్ రౌండ్ కు ఆదిక్యం పెరిగిపోతూ వస్తోంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ప్రియాంక గాంధీ మెజారిటీ 3.19 లక్షల ఓట్లకు పైగా చేరింది. ఆమె తర్వాతి స్థానాల్లో సిపిఐ అభ్యర్థి సత్యన్ మోకేరి ఉన్నారు. వయనాడ్ లో గెలవడం తన లక్ష్యం కాదని, ఐదు లక్షల మెజారిటీ రావాలన్న లక్ష్యమే తన ముందు ఉందంటూ ఆమె ప్రచార సమయంలో అనేక చోట్ల చెబుతూ వచ్చారు.
ప్రియాంక గాంధీ వాద్రా
వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా దూసుకుపోతున్నారు. ఐదు లక్షలకుపైగా మెజారిటీ సాధించేట్టుగా ఆమెకు రౌండ్ రౌండ్ కు ఆదిక్యం పెరిగిపోతూ వస్తోంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ప్రియాంక గాంధీ మెజారిటీ 3.19 లక్షల ఓట్లకు పైగా చేరింది. ఆమె తర్వాతి స్థానాల్లో సిపిఐ అభ్యర్థి సత్యన్ మోకేరి ఉన్నారు. వయనాడ్ లో గెలవడం తన లక్ష్యం కాదని, ఐదు లక్షల మెజారిటీ రావాలన్న లక్ష్యమే తన ముందు ఉందంటూ ఆమె ప్రచార సమయంలో అనేక చోట్ల చెబుతూ వచ్చారు. స్వయంగా సోనియా గాంధీ కూడా ప్రియాంక గాంధీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చారు. ఈ స్థానంలో మొత్తంగా 16 మంది అభ్యర్థులు పోటీగా దిగారు. 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీ సిపిఐ నేత పిపి సునీర్ పై 4.3 లక్షల మెజారిటీతో గెలిచారు. 2024 ఎన్నికల్లో సిపిఐ నాయకులు అన్ని రాజాపై మూడు లక్షల 60 వేల మెజారిటీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించాలనే లక్ష్యాన్ని ప్రియాంక గాంధీ పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే ఆమె తొలి నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు. ప్రియాంక గాంధీ మొదటిసారి ఎన్నికల బరిలో నిలవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పని చేశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వయనాడ్ లో ప్రియాంక గాంధీ సులభంగానే విజయం సాధిస్తారని తేల్చాయి. 2019లో రాహుల్ గాంధీ ఇదే నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం సాధించారు. ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోను మరోసారి రాహుల్ గాంధీ ఇక్కడ విజయం సాధించారు. రాయ్ బరేలి నియోజకవర్గంలో కూడా రాహుల్ గాంధీ విజయం సాధించడంతో వయనాడును వదులుకున్నారు. ఈ స్థానాన్ని తన సోదరికి ఆయన కేటాయించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలోకి దిగారు. కొద్దిరోజుల పాటు ఇక్కడే ప్రచారం నిర్వహించిన ఆమె తాజా ఫలితాల్లో భారీ విజయం దిశగా సాగుతున్నారు. గాంధీ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ ఒక్కరే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. అనారోగ్య కారణాలవల్ల సోనియా గాంధీ క్రియాశీలకంగా ఉండడం లేదు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి సహకరించేందుకు ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. 2019లోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను ప్రియాంక గాంధీ తీసుకున్నారు. ఇప్పుడు వయానాడు స్థానం నుంచి లోక్సభలో అడుగు పెట్టాలనుకుంటున్నారు ప్రియాంక గాంధీ. అందుకు అనుగుణంగానే ప్రియాంక గాంధీ బంపర్ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. ప్రియాంక గెలుపుతో ఓ కాంబినేషన్ షర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఉత్తరాదిన అన్నయ్య రాహుల్ గాంధీ, దక్షిణాదిన చెల్లెలు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలను ఇకపై చూడనున్నారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించనున్నారని ఆ పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇదే జరిగితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. ప్రియాంక గాంధీకి తన నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలు ఉండడంతో కొంత కలిసి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి సుమారు 5 లక్షల మేర మెజారిటీతో ప్రియాంక గాంధీ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో బిజెపి నేతృత్వంలోని కూటమి విజయం దిశగా ముందుకు సాగుతోంది. సుమారు 220 స్థానాల్లో ఈ స్థానం విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. 150 కి పైగా స్థానాల్లో సంపూర్ణమైన మెజారిటీతో బిజెపి నేతృత్వంలోని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. జార్ఖండ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి విజయం దిశగా సాగుతోంది.