ఏపీలోని కూటమి ప్రభుత్వం విజయవాడలో నీటి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సిప్లిన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో నీటి విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 20 కోట్లతో వాటర్ ఏరో డ్రోమ్ ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంచనాలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్సిఎస్ ఉడాన్ 3.1 పథకంలో భాగంగా దీన్ని నిర్మించనున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ఇటీవల ఏఏఐ అధికారులు వచ్చి పరిశీలించారు. హైదరాబాద్ - ప్రకాశం బ్యారేజీ - హైదరాబాద్ మార్గంలో సిప్లాన్ లను నడిపేందుకు కొన్ని బిల్లు కూడా వచ్చినట్లు తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలోని కూటమి ప్రభుత్వం విజయవాడలో నీటి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సిప్లిన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో నీటి విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 20 కోట్లతో వాటర్ ఏరో డ్రోమ్ ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంచనాలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్సిఎస్ ఉడాన్ 3.1 పథకంలో భాగంగా దీన్ని నిర్మించనున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ఇటీవల ఏఏఐ అధికారులు వచ్చి పరిశీలించారు. హైదరాబాద్ - ప్రకాశం బ్యారేజీ - హైదరాబాద్ మార్గంలో సిప్లాన్ లను నడిపేందుకు కొన్ని బిల్లు కూడా వచ్చినట్లు తెలిపింది. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కు చెందిన అధికారులు ఇటీవల ప్రకాశం బ్యారేజీని సందర్శించారు. నీటి విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే వుడాన్ పథకంలో భాగంగా అదనపు మొత్తాలను చెల్లించడంతోపాటు ఈ ఏడాది ఆగస్టు వరకు పొడిగించాలని అధికారులు కేంద్ర బృందాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..
సీప్ ప్లేన్ ప్రాజెక్టులో భాగంగా కొద్దిరోజుల కిందటే ప్రకాశం బ్యారేజీ లో విమానాన్ని ప్రయోగాత్మకంగా నడిపారు. ఇది విజయవంతం కావడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ నూతన విధానంపై చర్చ జరిగింది. పర్యాటకంగా కొత్త పుంతలు తొక్కించాలంటే ఈ తరహా సరికొత్త ప్రాజెక్టులను చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటకరంగానే అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నీటి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది కార్యరూపం దాల్చితే రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ మేరకు ఆయన అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోనే ప్రత్యేకంగా గుర్తింపును సంపాదించుకోవచ్చు అని ఆయన అధికారుల కోసం సూచించినట్లు చెబుతున్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని తద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని ఆయన అధికారులకు సూచించారు. కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడే ఉండడంతో సాంకేతిక పరమైన ఇబ్బందుల్లో సహకారాన్ని ఆయన అందించేందుకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇది కూడా ఈ నిర్ణయాన్ని పరుగులు పెట్టించేందుకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. కొద్దిరోజుల్లోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించి వేగంగా పూర్తి చేయడం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అధికారి రూపం దాల్చితే మాత్రం రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టుగా నిలుస్తుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి.