తెలంగాణలో ఉగాది పర్వదిన వేడుకను పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం అందించే పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించి కొన్ని గంటలు కూడా గడవకముందే క్రెడిట్ కోసం కాంగ్రెస్ పార్టీ, బిజెపి నేతల మధ్య వార్ నడుస్తోంది. ఈ పథకం తమ వాళ్ళే వచ్చిందంటూ బిజెపి.. పేద ప్రజల కోసం తామే ప్రారంభించామంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన క్రెడిట్ కొట్టేందుకు ఇరు పార్టీలకు చెందిన నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు.
మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఉగాది పర్వదిన వేడుకను పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం అందించే పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించి కొన్ని గంటలు కూడా గడవకముందే క్రెడిట్ కోసం కాంగ్రెస్ పార్టీ, బిజెపి నేతల మధ్య వార్ నడుస్తోంది. ఈ పథకం తమ వాళ్ళే వచ్చిందంటూ బిజెపి.. పేద ప్రజల కోసం తామే ప్రారంభించామంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన క్రెడిట్ కొట్టేందుకు ఇరు పార్టీలకు చెందిన నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. పేదల కోసం ఆలోచించే ఈ పథకాన్ని తెచ్చామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. ఈ పథకం ఖర్చులో మెజారిటీ వాటా కేంద్రాన్ని అని బిజెపి చెబుతోంది. ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేదలకు రూపాయి 90 పైసలకే కిలో బియ్యం ఇచ్చే పథకాన్ని ప్రారంభించారని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఈ పథకాన్ని కొనసాగించారన్నారు. తాము తీసుకువచ్చిన సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని, ఎవరు సీఎం అయినా ఈ పథకం కొనసాగించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల కోసమే ఆలోచిస్తుందని, అందుకే వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకం తెచ్చామని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఆహార భద్రత చట్టం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారని కామెంట్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చినదిగా చెబుతుంటే దీనికి కౌంటర్గా మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సన్న బియ్యం పథకంలోని మెజార్టీ ఖర్చు కేంద్ర ప్రభుత్వానిదే అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ఒక్కో కిలో కు కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు చెల్లిస్తోందన్నారు. సన్న బియ్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కిలోకి పడే భారం పది రూపాయలు మాత్రమేనని పేర్కొన్నారు. రేషన్ షాపుల్లో కనీసం మోదీ ఫోటో కూడా పెట్టడం లేదని ఆరోపించారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు కేంద్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇష్టం అనే విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. పేదలకు బియ్యం పంపిణీ సహా ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ వరకు అన్ని పథకాలు కాంగ్రెస్ హయాంలోనే మొదలయ్యాయని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. ఈ పథకం అమలు కోసం కేంద్రమే ఎక్కువ ఖర్చు చేస్తోందని బిజెపి అప్పుడే కౌంటర్ ఇవ్వడం ప్రారంభించింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై రెండు పార్టీల మరింతగా మాటలు యుద్ధం కొనసాగే అవకాశం ఉందనే చర్చా మొదలైంది. మంగళవారం నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. వర్షాకాలంలో కొనుగోలు చేసిన సన్న వడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చిన ప్రభుత్వం అందులో దాదాపు సగం బిరియాని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. ఏప్రిల్ కోటకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడ నుంచి రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా మొదలైంది. సన్న బియ్యం పథకానికి సంబంధించిన క్రెడిట్ కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీలో పోటీ పడుతుంటే బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గా ఉంది. ఈ పథకానికి సంబంధించి ఈ పార్టీకి చెందిన నేతలు కూడా సోమవారం స్పందించే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో కెసిఆర్ కూడా ఈ పథకానికి సంబంధించి కీలక ప్రతిపాదనలు చేశారు. కాబట్టి భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు కూడా దీనిపై స్పందించే అవకాశం ఉందని చెబుతున్నారు. సన్న బియ్యం పథకానికి సంబంధించి క్రెడిట్ కొట్టేందుకు నేతల ప్రయత్నిస్తుంటే.. ప్రజలు మాత్రం ఎవరు తెస్తే ఏముంది తమకు మంచి జరిగితే చాలు అన్న భావనలో ఉన్నారు.