క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలనుకుంటున్నారా.. మరి ఇలా చేసేయండి

ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డ్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. అవసరం ఉన్న లేకపోయినా ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటూ వాటిని విరివిగా వినియోగిస్తున్నారు. కొంత ఆదాయం వచ్చిన వారు క్రెడిట్ కార్డు వినియోగించిన ఇబ్బందులు ఉండవు. చాలామంది ఆదాయానికి మించి క్రెడిట్ కార్డులు వినియోగిస్తుండడంతో అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. ఒక స్థిరమైన సంపాదన లేని వాళ్ళు కూడా క్రెడిట్ కార్డులను పరిధికి మించి వినియోగిస్తూ మెడకు గుదిబండల్లా ఆ అప్పులు మారేలా చేసుకుంటున్నారు.

Credit cards

క్రెడిట్ కార్డ్స్ 

ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డ్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. అవసరం ఉన్న లేకపోయినా ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటూ వాటిని విరివిగా వినియోగిస్తున్నారు. కొంత ఆదాయం వచ్చిన వారు క్రెడిట్ కార్డు వినియోగించిన ఇబ్బందులు ఉండవు. చాలామంది ఆదాయానికి మించి క్రెడిట్ కార్డులు వినియోగిస్తుండడంతో అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. ఒక స్థిరమైన సంపాదన లేని వాళ్ళు కూడా క్రెడిట్ కార్డులను పరిధికి మించి వినియోగిస్తూ మెడకు గుదిబండల్లా ఆ అప్పులు మారేలా చేసుకుంటున్నారు. ఈ బాధలు భరించలేక చాలామంది క్రెడిట్ కార్డులను పూర్తిగా క్లోజ్ చేయాలని కోరుకుంటున్నారు. అయితే క్లోజ్ చేసే ప్రక్రియ తెలియక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా ఆదాయం లేని వాళ్ళు క్రెడిట్ బిల్లులు కట్టలేక పోతున్నారు. మరి కొంతమంది కొన్ని క్రెడిట్ కార్డులు పొందిన తర్వాత, వాటిపై చాలా రకాలు చార్జీలను వడ్డిస్తున్నారని అర్థం చేసుకుంటున్నారు. తమ దగ్గరున్న కార్డులతో ప్రయోజనం చాలా తక్కువగా ఉందని ఇంకొంతమంది రియలైజ్ అవుతున్నారు. అటువంటి వారు కూడా కార్డులను పూర్తిగా క్లోజ్ చేయడమే మంచిదని భావిస్తున్నారు. అటువంటి వారంతా కార్డును క్లోజ్ చేసే ముందు దాని బకాయిలన్నింటిని కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. సదర సంస్థకు పైసల్లో బాకీ ఉన్నా సరే క్రెడిట్ కార్డు క్లోజ్ చేసేందుకు అవకాశం ఉండదు. 

క్రెడిట్ కార్డును రద్దు చేసుకోవాలనే తొందరలో రివార్డు పాయింట్లు రీడిమ్ చేయడం చాలామంది మర్చిపోతుంటారు.  డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల ఆ రివార్డు పాయింట్లు సంపాదించారు. కాబట్టి క్రెడిట్ కార్డును మూసి వేసే ముందు రివార్డు పాయింట్లను రీడీమ్ చేయడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బీమా ప్రీమియం, ఓటిటీ మంత్లీ సబ్ స్క్రిప్షన్, కరెంటు బిల్లులు, ఇంటి అద్దె, వాలెట్ల టాపప్ వంటి రిపీట్ అయ్యే చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు. కార్డును క్లోజ్ చేసే ముందు అలాంటి ఇన్స్ట్రక్షన్ల లేకుండా చూసుకోవాలి. లేదంటే కార్డు మూసివేసిన తర్వాత చెల్లింపు ఆగిపోయే ఇబ్బందులు ఎదుర్కావచ్చు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత క్రెడిట్ కార్డు బ్యాంకుకు కాల్ చేయాల్సి ఉంటుంది. కార్డును మోసివేయాలనుకుంటున్న విషయాన్ని వారికి తెలియజేయాలి. క్రెడిట్ కార్డును క్లోజ్ చేస్తున్న కారణాన్ని బ్యాంకు అడగవచ్చు. క్రెడిట్ కార్డుతో ఎదురవుతున్న ఇబ్బందులను వారికి తెలియజేయవచ్చు. ఆ తరువాత క్రెడిట్ కార్డును మూసివేయమని వినియోగదారులు ఇచ్చే రిక్వెస్ట్ ను బ్యాంకు తీసుకుంటుంది. బ్యాంకు వినియోగదారుడుని ఈమెయిల్ పంపమని అడగొచ్చు. లేకపోతే కార్డును కట్ చేసి దాని ఫోటోను ఈమెయిల్ చేయమని కూడా కోరవచ్చు. అలాంటి సందర్భంలో బ్యాంకు కోరినట్టు చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డును క్లోజ్ చేసిన తర్వాత ఆ కార్డును డస్ట్ బిన్ లో పడేయాల్సిన అవసరం లేదు. కార్డు క్లోజ్ చేసిన తర్వాత దానిని అడ్డంగా కాకుండా కాస్త మూలగా కట్ చేయాలి. నాలుగైదు ముక్కలు చేయాల్సి ఉంటుంది. కార్డులోని చిప్ ను కూడా కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి కార్డు వెళ్లకుండా చేసినట్టు అవుతుంది. కార్డును అలాగే పడేసినట్టు అయితే తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే మళ్ళీ దానిని వినియోగించే ప్రమాదం ఉంది. కాబట్టి కార్డును క్లోజ్ చేసిన తర్వాత ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్