వైఎస్ జగన్ పై విశాఖ టిడిపి నేతలు ఆగ్రహం.. శవ రాజకీయాలు మానాలంటూ హితవు

ఫార్మా కంపెనీలో ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు అంటూ విశాఖకు చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా శవరాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతోపాటు ఎంపీ శ్రీ భరత్, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వైయస్ జగన్ పై విమర్శలు గుప్పించారు.

Representatives of Telugu Desam Party

తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు

ఫార్మా కంపెనీలో ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు అంటూ విశాఖకు చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా శవరాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతోపాటు ఎంపీ శ్రీ భరత్, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వైయస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ అనకాపల్లి వచ్చిన జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శకు వచ్చి రాజకీయ పరమైన విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రమాద బాధితుల విషయంలో ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించిందన్నారు. కేజీహెచ్ వద్ద వైసీపీ నేతలు బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. లీగల్ హెయిర్ లేకుండా చెక్కులు ఇవ్వరని వైసీపీ నేతలకు తెలియదా..? అని పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి బాధితులను పరామర్శించారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల్లో భద్రత లేదని ఎన్నోసార్లు చెప్పామన్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం భద్రత గురించి పట్టించుకోలేదని, ఆ ఫలితమే ఎస్సెన్షియా ప్రమాదమని పల్లా పేర్కొన్నారు. శవ రాజకీయాల మీద పుట్టి, హత్యా రాజకీయాల మీద జగన్ ఎదిగారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితులను పరామర్శించేందు వచ్చినా జగన్ నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మూలాల శవ రాజకీయాలని, తండ్రి చనిపోతే అధికారం కోసం సంతకాలు చేశారని విమర్శించారు. 2019లో ఎన్నికల్లో బాబాయి శవంతో రాజకీయం చేశారని ఆరోపించారు. స్టేట్ డిజాస్టర్ కి చెందిన రూ.1500 కోట్లు నిధుల్ని డైవర్ట్ చేశారన్న పల్లా శ్రీనివాసరావు.. భవిష్యత్ లో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా సేఫ్టీ ఆడిట్ పై ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు. ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ అబద్ధాలు 100 సార్లు చెబితే ప్రజలు నమ్మరన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ హయాంలో పొల్యూషన్ కంట్రొల్ బోర్డును ప్రతిపక్ష పార్టీలకు చెందిన కంపెనీలపై మాత్రమే దృష్టి పెట్టేలా చేశారని ఆరోపించారు. విశాఖలో కంటే హైదరాబాద్ లో ఫ్యాక్టరీలు అధికంగా ఉన్నాయని, కానీ, విశాఖలో ఎక్కువ ప్రమాదాలు జరగడానికి వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలే అయిందని, ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం చేసిన నష్టమే ఈ ప్రమాదాలకు కారణంగా భరత్ ఆరోపించారు. LG ఫార్మా ప్రమాదంలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. చంద్రబాబుపై నమ్మకంతో ప్రస్తుత బాధితులు ఉన్నారని, వారి కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం వుంటుందన్నారు. విశాఖ పరిశ్రమల్లో భద్రతపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ చిరంజీవి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి తదితరులు ఉన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్