నేడు విశాఖ స్థానిక సంస్థల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన.. ఖరారు చేయనున్న అధినేత చంద్రబాబు

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. కొద్దిరోజులుగా ఈ స్థానంపై పోటీ చేయాలా వద్దా అన్నదానిపై తెలుగుదేశం పార్టీ సంశయంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలన్న భావన ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతుండడంతో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది.

TDP leader Nara Chandrababu Naidu

టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. కొద్దిరోజులుగా ఈ స్థానంపై పోటీ చేయాలా వద్దా అన్నదానిపై తెలుగుదేశం పార్టీ సంశయంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలన్న భావన ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతుండడంతో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈ స్థానానికి ఇప్పటికే వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. ఉత్తరాంధ్రకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను వైసిపి అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే ఆయన ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీకి ఉన్న ఎంపీటీసీలు, జడ్పిటిసి లతో ఆయన సమావేశం అయ్యారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన సుమారు 100 మందిని వైసిపి బెంగళూరు క్యాంపుకు తరలించినట్లు చెబుతున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ, జడ్పిటిసిలను కాపాడుకోవడమే లక్ష్యంగా వైసిపి వ్యూహాలను రచిస్తోంది.

సీనియర్ నేత ఆయన బొత్స సత్యనారాయణ తన రాజకీయ చతురతను ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వినియోగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో మెజార్టీ లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడంతో వైసిపి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఫలు దఫాలుగా సమావేశమయ్యారు. ఎవరని పోటీకి దించాలి అన్నదానిపై ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. కోటం తరఫున బైరా దిలీప్ చక్రవర్తి, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జి, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తదితరులు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరినో ఒకరు ఖరారు చేసి సోమవారం సాయంత్రానికి అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాల రచించాలని జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోమవారం వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళవారంతో నామినేషన్ దాఖలకు గడువు ముగియనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్