మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. సీఎం ఇంటిపై దాడికి యత్నం

మణిపూర్ లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంపాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు పలువురు ప్రయత్నించారు. దీంతో ఇంపాల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్ పోక్పి, చూర చంద్ పూర్ జిల్లాలో రెండు రోజులపాటు ఇంటర్నెట్ నిలిపివేశారు. రోజురోజుకు హింసాత్మక వాతావరణం పెరిగిపోవడంతో పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసి ఆస్తులను ధ్వంసం చేశారు.

Security forces firing tear gas

టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న భద్రతా దళాలు

మణిపూర్ లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంపాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు పలువురు ప్రయత్నించారు. దీంతో ఇంపాల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్ పోక్పి, చూర చంద్ పూర్ జిల్లాలో రెండు రోజులపాటు ఇంటర్నెట్ నిలిపివేశారు. రోజురోజుకు హింసాత్మక వాతావరణం పెరిగిపోవడంతో పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసి ఆస్తులను ధ్వంసం చేశారు. సపమ్ నిషికాంత్ సింగ్ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గేటు ముందు నిర్మించిన బంకర్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నిరసనకారులు రాష్ట్ర మంత్రులు సపమ్ రంజన్, ఎల్ సుసింద్రో సింగ్, వై ఖేమ్ చంద్ ఇళ్లను ముట్టడించారు. ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఇంపాల్ లో దాడులు నేపథ్యంలో ఐదు జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

మణిపూర్ లోని పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. జీరిబామ్ జిల్లాలో అనుమానాస్పదంగా మృతి చెందిన ముగ్గురు వ్యక్తులకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకారులు నిరసనలకు దిగారు. 24 గంటల్లో హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం వీరాన్ సింగ్ అల్లుడు ఇళ్లతో సహా ప్రజా ప్రతినిధుల ఎల్లమందు నిరసనకారులు ఆందోళన చేశారు ఆ తర్వాత ఎల్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు భద్రతా దళాలు ఆందోళన కారులపై టియర్ ప్రయోగించి చెదరగొట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇంపాల్ లో నెలకొన్న ఈ పరిస్థితులు పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా పరిస్థితులు మరోసారి భయాందోళనకు గురి చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడంతోపాటు శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. భద్రతా దళాలు ఇప్పటికీ ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆందోళనలు అదుపులోకి వచ్చాయని, ప్రజలు భయాందోళన చెందవద్దంటూ పలువురు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్