వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, ఆ పార్టీలో నెంబర్ 2 గా భావించే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. విజయ్ సాయి రెడ్డి చేసిన ప్రకటన రాజకీయాల్లో ప్రకంపనుల సృష్టిస్తోంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు ఈ ప్రకటన తర్వాత ఒక్కసారిగా ఢీలా పడ్డాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్న విజయసాయిరెడ్డి ఒక్కసారిగా ఇప్పుడు రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించడంతో ఆ పార్టీ కీలక నేతలు కూడా షాక్ కు గురయ్యారు. దీనిపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా.? అన్న కోణంలో చర్చ జరుగుతోంది.
విజయ్ సాయి రెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, ఆ పార్టీలో నెంబర్ 2 గా భావించే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. విజయ్ సాయి రెడ్డి చేసిన ప్రకటన రాజకీయాల్లో ప్రకంపనుల సృష్టిస్తోంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు ఈ ప్రకటన తర్వాత ఒక్కసారిగా ఢీలా పడ్డాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్న విజయసాయిరెడ్డి ఒక్కసారిగా ఇప్పుడు రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించడంతో ఆ పార్టీ కీలక నేతలు కూడా షాక్ కు గురయ్యారు. దీనిపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా.? అన్న కోణంలో చర్చ జరుగుతోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డితో విజయసాయి రెడ్డికి సత్సంబంధాలు కొరవడ్డాయి. ఒకరకంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డికి జగన్ కు మధ్య దూరం పెరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేత పదవి నుంచి జగన్ తొలగించి ఆ బాధ్యతలను తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. అప్పటి నుంచి విజయసాయిరెడ్డి అన్య మనస్కంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పటివరకు రాజకీయాల్లో ఉన్న విజయసాయి రెడ్డి అనేక పదవులను అనుభవించారు. ఇకపై రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇంతకుమించి పదవులు అనుభవించే పరిస్థితి లేదని ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో కాకినాడ డీప్ సీ పోర్ట్ వ్యవహారంలో తన వియ్యంకుడు చందన అరవిందో కంపెనీపై విచారణ జరుగుతుంది. ఈ కేసులో విజయసాయిరెడ్డిని ఇప్పటికే ఈడి అధికారులు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక పెద్ద మంత్రంగామే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేంద్ర బిజెపి పెద్దల ఒత్తిడి మేరకే విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా వెళుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే కొద్ది రోజుల్లోనే ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉంది అన్న ప్రచారం కూడా నడుస్తోంది.
ఇది విజయసాయిరెడ్డి ప్రకటన సారాంశం..
విజయసాయిరెడ్డి తాను రాజకీయాల్లో తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ఇలా ఉంది. 'రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీలోను చేరడం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను' అని విజయసాయిరెడ్డి ముగించారు.