విజయసాయిరెడ్డి వ్యవసాయం పక్కన పెట్టేసారా.. టార్గెట్ వైసిపియేనా.!

వైసిపి మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గడిచిన కొద్దిరోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు వైసిపిని ఇరకాటంలోకి నెడుతున్నాయి. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన విజయసాయిరెడ్డి వైసీపీ అప్పగించిన రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేశారు. రాజకీయాలకు తాను దూరంగా ఉంటూ ఇకపై వ్యవసాయం చేసుకుంటానని రాజీనామా సందర్భంగా ప్రకటించారు. అయితే ఆయన ఆ తర్వాత నుంచి చేస్తూ వస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని కనబరుస్తున్నాయి. విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా, వ్యవసాయానికి దగ్గరగా ఉంటానన్న చేసిన వ్యాఖ్యలు పక్కన పెట్టినట్లు తాజాగా కనిపిస్తోంది.

Jagan, Vijayasai Reddy

జగన్, విజయసాయిరెడ్డి 

వైసిపి మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గడిచిన కొద్దిరోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు వైసిపిని ఇరకాటంలోకి నెడుతున్నాయి. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన విజయసాయిరెడ్డి వైసీపీ అప్పగించిన రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేశారు. రాజకీయాలకు తాను దూరంగా ఉంటూ ఇకపై వ్యవసాయం చేసుకుంటానని రాజీనామా సందర్భంగా ప్రకటించారు. అయితే ఆయన ఆ తర్వాత నుంచి చేస్తూ వస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని కనబరుస్తున్నాయి. విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా, వ్యవసాయానికి దగ్గరగా ఉంటానన్న చేసిన వ్యాఖ్యలు పక్కన పెట్టినట్లు తాజాగా కనిపిస్తోంది. ఆయన గడిచిన కొద్ది రోజుల నుంచి చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే వైసీపీని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీలో నెంబర్ 2 స్థాయికి ఎదిగిన విజయసాయిరెడ్డి ఆ తర్వాత అనేక కారణాల వల్ల పార్టీకి దూరమవుతూ వచ్చారు.

రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన సమయంలో కూడా జగన్కు మంచే జరగాలంటూ పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత నుంచి ఆయన మాటల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో లేను అంటూనే జగన్ సహా వైసిపి కీలక నేతలు అందరిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. విజయ్ సాయి రెడ్డి చేస్తున్న విమర్శలను చూస్తున్న వారంతా జగన్ ను అలా అంటున్నారేంటి అంటూ పేర్కొనడం గమనార్హం. ముందు చెప్పిన దానికి భిన్నంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతుండడంతో వైసిపి కూడా అంతర్మదనం చెందుతోంది. అదే సమయంలో ఎవరో మాట్లాడించి ఉంటారన్నది కూడా వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న అనుమానం. విజయసాయిరెడ్డి వైసీపీ నాయకుల పై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం వెనుక బిజెపికి చెందిన కీలక నాయకులు ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ఎంపీ స్థానానికి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన బిజెపిలో చేరి అదే సీటును తిరిగి తీసుకుంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. బిజెపి నాయకులతో విజయసాయి రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేసి గవర్నర్ గా గాని, మళ్లీ రాజ్యసభ స్థానానికి గాని ఎన్నికయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు అటువంటి ప్రతిపాదనలు ఏవి రాయనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటు బిజెపికి వెళ్లే అవకాశం ఉండడంతో ఆ పార్టీకి సంబంధించిన అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు ఇవ్వవచ్చని కొన్ని సర్కిల్స్లో ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం విజయసాయిరెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. 

జగన్ ను లక్ష్యంగా చేసుకోవడానికి కారణం అదేనా.!

విజయసాయిరెడ్డి కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో సిఐడి విచారణకు హాజరవుతున్నారు. విచారణకు హాజరైన ప్రతిసారి ఆయన జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని.. ఆ కోటరీ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పైకి ఎదగలేరంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి కుమారుడుపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. మద్యం కుంభకోణానికి సంబంధించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇవన్నీ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇరికించే కుట్రలో భాగంగానే చేస్తున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి రాజకీయాలు మానేసి వ్యవసాయం చేసుకుంటారన్న మాటల్లో వాస్తవం లేదని.. ప్రస్తుతం ఆయన వ్యవసాయాన్ని పక్కనపెట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలను సాగిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై వైసీపీ కూడా అంతే స్థాయిలో స్పందిస్తోంది. వైసీపీలో కోటరీ ఉందని విజయసాయిరెడ్డి చేసిన విమర్శల్లో నిజం ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు. ఆ కోటరీ ఉంటే దానికి ఆది గురువు విజయసాయిరెడ్డి మాత్రమేనని పలువురు విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో విజయ్ సాయి రెడ్డిని మించిన వాళ్లు ఇంకా ఎవరు ఉన్నారంటూ పలువురు పేర్కొంటున్నారు. అధికారం ఉన్నప్పుడు అన్ని రకాలుగా ప్రభుత్వానికి మచ్చ తెచ్చి.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడం దేనికి సంకేతమని వైసిపికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి వెనుక ఎవరు ఉండి మాట్లాడిస్తున్నారన్నది కొద్ది రోజుల్లోనే తేలుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయనేతగా ఉన్న విజయ్ సాయి రెడ్డి ఇప్పుడు ఆయనకు కొరకరానికి కొయ్యగా మారడం వైసిపికి కూడా ఇబ్బందిగా మారిందని చెప్పాలి. మరి విజయసాయిరెడ్డి విషయంలో వైసిపి భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్