గడిచిన కొద్దిరోజులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్సార్ షర్మిల మధ్య ఆస్తి పంపకానికి సంబంధించి వివాదం జరుగుతోంది. ఈ వివాదం వైయస్ ఫ్యామిలీని రెండు ముక్కలుగా చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకరకంగా చెప్పాలంటే వైయస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడినట్లు అర్థమవుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఈ వివాదానికి సంబంధించి అనేకమంది మాట్లాడుతూ వస్తున్నారు.
తల్లి విజయమ్మతో వైఎస్ జగన్
గడిచిన కొద్దిరోజులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్సార్ షర్మిల మధ్య ఆస్తి పంపకానికి సంబంధించి వివాదం జరుగుతోంది. ఈ వివాదం వైయస్ ఫ్యామిలీని రెండు ముక్కలుగా చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకరకంగా చెప్పాలంటే వైయస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడినట్లు అర్థమవుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఈ వివాదానికి సంబంధించి అనేకమంది మాట్లాడుతూ వస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫున రాజ్యసభ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి నేతలు మీడియా ముందుకు వచ్చి వైయస్ షర్మిలదే తప్పు అన్నట్టు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ షర్మిల కూడా తీవ్ర స్థాయిలోనే బదులిచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్న మాటలతో తన తల్లి మదనపడుతోందంటూ పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడిన తర్వాత విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి ఆస్తుల పంపకాల ప్రక్రియ ఎప్పుడో పూర్తయింది అన్నట్లు మాట్లాడారు. మీరు మాట్లాడిన తర్వాత షర్మలదే తప్పు అన్న భావన చాలామందిలో వ్యక్తం అయింది. అయితే ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి వైయస్ విజయమ్మ ఎంట్రీ ఇచ్చారు. మీడియాకు, ప్రజలకు ఒక లేఖను ఆమె విడుదల చేశారు. ఈ లేఖలో వివాదానికి సంబంధించిన సుదీర్ఘమైన అంశాలను ఆమె ప్రస్తావించారు. ఇందులో ఆమె అసలు విషయం ఏంటన్న దానిని ప్రస్తావించారు.
షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తి ప్రేమతో ఇస్తున్నది కాదని, బాధ్యతతో ఇవ్వాల్సినదంటూ వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. అటాచ్మెంట్ లో లేని ఆస్తులను మాత్రమే ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గతంలో అంగీకరించారని, పాపకు అవి ఇవ్వడం లేదంటూ వైఎస్ విజయమ్మ ఆ లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో వైయస్ బతికి ఉండగానే ఉమ్మడి ఆస్తుల పెంపకం జరిగిందంటూ వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తప్పుడు మాటలు చెబుతున్నారంటూ ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. వీటితోపాటు అనేక అంశాలను క్రోడీకరించిన ఆమె.. ఒకరకంగా జగన్మోహన్ రెడ్డిదే తప్పు అన్నట్టుగా నిర్ధారించారు. తమ బిడ్డల వివాదాన్ని తాము ఎంతగానే నమ్మే యేసయ్య తీరుస్తాడన్న విజయమ్మ.. ఈ వివాదాన్ని పెద్దది చేయవద్దంటూ హితవు పలికారు. ప్రస్తుతం వైయస్ విజయం రాసిన ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది. సోదరుడు సోదరి మధ్య తలెత్తిన వివాదాన్ని సద్దుమణిగించేలా విజయమ్మ చేస్తారని అంతా భావించారు. అందుకే విజయమ్మ వంటి వారు బయటకు వచ్చి మాట్లాడితే ఈ వివాదం సద్దుమణుగుతుందని బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే నేతలు చెప్పారు. అయితే విజయమ్మ లేఖ తరువాత ఈ వివాదం మరింత రాజుకున్నట్టు అయింది. వైయస్ విజయమ్మ లేఖ పూర్తిగా వైయస్ షర్మిలకు అనుకూలంగా ఉండడంతో.. వైసీపీ శ్రేణులు ఈ లేఖను కప్పుబడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే తల్లి, చెల్లి పార్టీతోపాటు జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారని, వారంతా కూడా బలుక్కునే ఈ తరహా చర్యలకు పాల్పడుతూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ అనడానికి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా విజయమ్మ రాసిన ఈ లేఖ ఆస్తి వివాదంలో జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్ లోకి నెట్టినట్టు అయింది.