ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు అస్వస్థత.. ఎయిమ్స్ కు తరలింపు

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చేర్చారు. ఛాతిలో తీవ్రమైన నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. చాతి నొప్పితో బాధపడుతున్న ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని వైద్య సిబ్బంది సూచించడంతో వెంటనే ఏం స్కూల్ తరలించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున చాతి నొప్పితో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.

Vice President Jagadeep Dhankar

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ 

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చేర్చారు. ఛాతిలో తీవ్రమైన నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. చాతి నొప్పితో బాధపడుతున్న ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని వైద్య సిబ్బంది సూచించడంతో వెంటనే ఏం స్కూల్ తరలించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున చాతి నొప్పితో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. సుమారు రెండు గంటల సమయంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు కుటుంబ సభ్యులతో పాటు సిబ్బంది ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారాయణ ఆధ్వర్యంలో ఆయనకు ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్య బృందం వెల్లడించింది. ఉపరాష్ట్రపతికి అస్వస్థతకు గురికావడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ బిజెపి జాతి అధ్యక్షుడు జేపీ నడ్డాకు వెళ్లి పరామర్శించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి కూడా ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలను తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్య సేవలను అందించాలని ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం అధికారులకు సూచించినట్లు చెబుతున్నారు. మరోవైపు వైద్యులు కూడా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. కార్డియాలజీ బృందం ఉపరాష్ట్రపతికి వైద్య సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్