ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చిన వందే భారత రైళ్ల స్లీపర్ సేవలు కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు స్లీపర్ రైళ్లు తయారీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. మూడు నెలల్లో దేశవ్యాప్తంగా స్లీపర్ రైలు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తుంది. ఇప్పటికే స్లీపర్ రైళ్ళు తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.
వందే భారత స్లీపర్ రైళ్ళు
ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చిన వందే భారత రైళ్ల స్లీపర్ సేవలు కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు స్లీపర్ రైళ్లు తయారీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. మూడు నెలల్లో దేశవ్యాప్తంగా స్లీపర్ రైలు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తుంది. ఇప్పటికే స్లీపర్ రైళ్ళు తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. వందే భారత్ స్లీపర్ ట్రైన్ కోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఈఎంఎల్) కంపెనీలు తయారు చేస్తున్న బోగీల నమూనా ఫోటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ ఆదివారం విడుదల చేశారు. ఏ రైలు మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. 823 బెర్తులు ఉండనున్నాయి. మధ్యతరగతిన దృష్టిలో పెట్టుకుని ఈ రైలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టికెట్ రేట్లు రాజధాని ఎక్స్ప్రెస్ స్థాయిలో ఉంటాయని మంత్రి వివరించారు. వందే భారత్ స్లీపర్ రైలు బోగీలో ఆక్సిజన్ సరఫరా, వైరస్ వ్యాప్తిని నియంత్రించే వ్యవస్థలతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన టాయిలెట్లు, వేడి నీటి సదుపాయం, అగ్ని నిరోధక వ్యవస్థ.. ఇలా చాలా వస్తువులు ఉంటాయని వెల్లడించారు. రైలు ప్రమాదాలను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరించే కవచ్ వ్యవస్థ కూడా ఇందులో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ రైళ్లను దశలవారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానన్నారు. ప్రస్తుతం వందే భారత రైళ్ళు తిరుగుతున్న ప్రాంతాల్లో ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణను కేంద్ర రైల్వే శాఖ చేపడుతోంది. తొలి దశలో అందుబాటులోకి వచ్చే రైళ్ల సంఖ్యను బట్టి ఏఏ ప్రాంతాల్లో అందుబాటులోకి స్లీపర్ రైల్ సేవలు తీసుకురావాలన్న దానిపై కేంద్ర రైల్వే శాఖ పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఈ రైలులో ప్రత్యేకతలు ఎన్నో
వందే భారత్ రైలులో అనేక ప్రత్యేకతలు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ రైలు మొత్తం 16 కోచులతో ఉంటుంది. ఏసీ త్రీ టైర్ కు చెందిన 11 కోచ్ లు, ఏసి టూ చైర్ చెందిన కోచ్ లు నాలుగు, మిగిలినవి ఏసీ ఫస్ట్ కోచ్ లో ఉంటాయి. రైలు మొత్తం 823 మంది ప్రయాణికుల బెర్త్ సామర్థ్యం కలిగి ఉంది. ఏసీ త్రీ టైర్ లో 611 మంది, ఏసీ టూ టైర్ లో 188 మంది, ఏసీ-1 లో 24 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది.