అల్లు అర్జున్ కూడా 11 నెంబర్ అంటే ఉలిక్కిపడేలా పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పుష్ప -2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాదులోని సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో ప్రదర్శించారు. ఇక్కడ జరిగిన తొక్కిసిలాటలో ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ను A11 గా పోలీసులు చేర్చారు. దీంతో 11 నెంబర్ చూడగానే చాలామంది జగన్మోహన్ రెడ్డి సాధించిన 11 స్థానాలను గుర్తుచేసుకున్నారు. ఎక్కడో తేడా కొడుతోంది శీనా అన్నట్టుగా ఈ లెవెన్ నెంబర్ అల్లు అర్జున్ కు కేటాయించినట్లు చాలామంది వ్యాఖ్యానించారు కూడా.
అల్లు అర్జున్
రాజకీయాల్లో కొన్ని నెంబర్లు కొంత మంది నేతలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు 23 స్థానాలు మాత్రమే టిడిపికి వచ్చాయి. అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసిపి తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్లే చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు మిగిలారంటూ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత 23 సంఖ్యతో ఏది జరిగిన చంద్రబాబుకు ముడిపెడుతూ వైసిపి నానాయాగి చేస్తూ వచ్చేది. కాలం గడిచింది. ఐదేళ్లు వైసిపి ప్రభుత్వ పాలన ముగిసింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు వైసీపీని కూటమి నేతలు, కార్యకర్తలు ఒక ఆట ఆడుకుంటున్నారు. లెవెన్ రెడ్డి అంటూ జగన్ ను ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం 11 కేంద్రంగా ఏపీలో వైసీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు జరుగుతున్నాయి. అయితే, ఈ నెంబర్ ఫోబియా ఇప్పటివరకు రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితం కాగా.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ నెంబర్ వ్యవహారం అంటుకుంది. అల్లు అర్జున్ కూడా 11 నెంబర్ అంటే ఉలిక్కిపడేలా పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పుష్ప -2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాదులోని సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో ప్రదర్శించారు. ఇక్కడ జరిగిన తొక్కిసిలాటలో ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ను A11 గా పోలీసులు చేర్చారు. దీంతో 11 నెంబర్ చూడగానే చాలామంది జగన్మోహన్ రెడ్డి సాధించిన 11 స్థానాలను గుర్తుచేసుకున్నారు. ఎక్కడో తేడా కొడుతోంది శీనా అన్నట్టుగా ఈ లెవెన్ నెంబర్ అల్లు అర్జున్ కు కేటాయించినట్లు చాలామంది వ్యాఖ్యానించారు కూడా. ఇది యాదృచ్ఛికంగానే జరిగింది అని అంతా అనుకునే లోపు మరో ఆసక్తికరమైన ఘటన ఇదే నెంబర్ తో కూడుకుని చోటుచేసుకుంది. ఈ కేసులో బెయిల్ పై బయట ఉన్న అల్లు అర్జున్ ను పోలీసులు మరోసారి విచారణకు వినిపిస్తున్నారు. మంగళవారం 11 గంటలకు విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో మరోసారి అల్లు అర్జున్ కేసులో 11 నెంబర్ చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారిన 11 నెంబర్ ప్రస్తుతం అల్లు అర్జున్ కేసులో కీలకంగా మారుతుండడం యాదృచ్ఛికమా.? లేక జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసేలా ఇలా చేస్తున్నారా అన్నదానిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ ప్రస్తుతం 11 నెంబర్ ఇబ్బందులకు గురిచేస్తుందని చెప్పాలి. ఈ కేసు ఎటువైపు మల్లుతుందో తెలియక అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో జగన్ కు, సినిమా రంగంలో సూపర్ స్టార్ గా ఎదుగుతున్న అల్లు అర్జున్ కు ప్రస్తుతం 11 నెంబర్ ఇబ్బందికరంగా మారింది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇంకెన్ని లెవెన్ నెంబర్లతో కూడిన వ్యవహారాలను ఎదుర్కోవాల్సి ఉంటుందో అన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. ఈ కేసులో 18 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ 11వ నిందితుడిగా చేర్చారు. అదే నెంబర్ వచ్చేలా చేయడం వెనుక కొందరి పెద్దల హస్తం ఉందా అన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో 11వ నిందితుడిగా పెట్టడం యాదృచ్ఛికమే అయితే.. మంగళవారం 11 గంటలకే విచారణకు రావాలంటూ పోలీసులు పిలవడం యాదృచ్ఛికం ఎలా అవుతుందంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 11 నెంబర్ ను అల్లు అర్జున్ కేసు చుట్టూ తిప్పడం ద్వారా గడిచిన ఎన్నికల్లో వైసీపీకి సపోర్టు చేయడం వల్లే ఈ తిప్పలు వస్తున్నాయి అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారా అంటూ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయనే దాన్ని బట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయని పలువురు విశ్లేషిస్తున్నారు.