అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు వెళుతుంటారు. గడిచిన కొన్నాళ్లుగా అమెరికాలో ఎంతోమంది విదేశాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాల్లో భారత్ సహా అనేక దేశాలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పుడు అటువంటి విద్యార్థులపై అమెరికాలో నూతనంగా ఏర్పడిన ట్రంప్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. తాజాగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ హెచ్చరిస్తూ ఉండడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు వెళుతుంటారు. గడిచిన కొన్నాళ్లుగా అమెరికాలో ఎంతోమంది విదేశాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాల్లో భారత్ సహా అనేక దేశాలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పుడు అటువంటి విద్యార్థులపై అమెరికాలో నూతనంగా ఏర్పడిన ట్రంప్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. తాజాగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ హెచ్చరిస్తూ ఉండడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అమెరికాలోని విశ్వవిద్యాలయాల క్యాంపస్లో జరిగిన ఆందోళనలో పాల్గొన్న విదేశీ విద్యార్థులంతా స్వచ్ఛందంగా క్యాంపస్ విడిచి వెళ్లిపోవాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఈమెయిల్ ద్వారా హెచ్చరికలను తాజాగా జారీ చేసింది. వీరితోపాటు ఆందోళనలకు సంబంధించిన సమాచారాన్ని, జాతి వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారికి కూడా ఈ తరహా మెయిల్ పంపించినట్లు ఇమిగ్రేషన్ అటార్నీ అధికారులు ధ్రువీకరించారు. వీరులో కొంతమంది భారతీయ విద్యార్థులు కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను కౌన్సిలేట్ అధికారులతో కలిసి విదేశాంగ శాఖ ఇటీవల నిశితంగా సమీక్షించింది. ఆ నివేదికలు ఆధారంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నారు. హమాస్, ఇతర ఉగ్రసంస్థలకు మద్దతు పలుకుతున్న అంతర్జాతీయ విద్యార్థులు వేషాలను రద్దు చేయడానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కు రూబియా ఏఐ ఆధారిత క్యాచ్ అండ్ రివోక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇది అమరలోకి వచ్చిన మూడు వారాల్లోనే 300 మందికి పైగా విదేశీ విద్యార్థుల స్టూడెంట్ వీసాలు రద్దయ్యాయి. రానున్న రోజుల్లో మరిన్ని వీసాలు రద్దయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వేషా జారీ చేసిన తర్వాత అదనపు సమాచారం అందుబాటులోకి వచ్చిందని, ఫలితంగా అమెరికా ఇమిగ్రేషన్ అండ్ నేషనలిటీ చట్టంలోనే సెక్షన్ 22 (1) ప్రకారం ఎఫ్1 వీసా రద్దయిందని విద్యార్థులకు పంపిన మెయిల్స్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అమెరికాలో నివసిస్తున్న భారతీయ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. గ్రీన్ కార్డుల ప్రాసెసింగ్ ప్రక్రియను నిలిపివేసింది. ఆదేశంలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వారి వివరాలను మరింత సమగ్రంగా పరిశీలన చేసే లక్ష్యంతో అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన రెండు కార్యనిర్వాహక ఆదేశాలను పాటించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. అమెరికాలో గడచిన కొన్నాళ్లుగా నెలకొంటున్న పరిస్థితులతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుందని చెబుతున్నారు. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో పెద్ద ఎత్తున అలజడి నెలకొంది. ప్రభుత్వానికి చెందిన పెద్దలు అమెరికాతో సంప్రదింపులు జరిపి విద్యార్థులకు మేలు చేకూర్చాలని పలువురు కోరుతున్నారు.