భారత వలసదారులపై అమెరికా ఉక్కుపాదం.. మళ్లీ సంకెళ్లతో వెనక్కి.!

అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు, ఉన్నత చదువులు చదివేందుకు సరైన పత్రాలు లేకుండా వెళ్లిన భారతీయులపై అమెరికా ఉక్కు పాదం మోపుతోంది. ఇప్పటికే అటువంటి వారిని గుర్తించి యుద్ధ విమానాల్లో సంకెళ్లు వేసి మరి భారత్ కు పంపిస్తున్న అమెరికా.. తాజాగా మరో యుద్ధ విమానంలో అటువంటి వారిని భారత్ కు పంపించింది. కొద్దిరోజులు కిందట యుద్ధ విమానంలో వచ్చిన భారతీయులకు సంకెళ్లు వేసి మరి పంపించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడంతో ఈ విషయంలో కాస్త సానుకూలంగా వ్యవహరిస్తుందని అంతా భావించారు.

Indians going to the plane with shackles

సంకెళ్లతో విమానంలోకి వెళుతున్న భారతీయులు

అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు, ఉన్నత చదువులు చదివేందుకు సరైన పత్రాలు లేకుండా వెళ్లిన భారతీయులపై అమెరికా ఉక్కు పాదం మోపుతోంది. ఇప్పటికే అటువంటి వారిని గుర్తించి యుద్ధ విమానాల్లో సంకెళ్లు వేసి మరి భారత్ కు పంపిస్తున్న అమెరికా.. తాజాగా మరో యుద్ధ విమానంలో అటువంటి వారిని భారత్ కు పంపించింది. కొద్దిరోజులు కిందట యుద్ధ విమానంలో వచ్చిన భారతీయులకు సంకెళ్లు వేసి మరి పంపించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడంతో ఈ విషయంలో కాస్త సానుకూలంగా వ్యవహరిస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అమెరికా విధానంలో ఎటువంటి మార్పు రాకపోవడం గమనార్హం. తాజాగా మరో యుద్ధ విమానంలో 228 మందిని భారత్ కు పంపించిన అమెరికా.. గతంలో మాదిరిగానే సంకెళ్లు వేసి మరి తరలించింది. రెండు విడతల్లో వచ్చిన వీరిని పంజాబ్ లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. తమ చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో బంధించి తీసుకువచ్చారని భారతీయ వలసదారులు వాపోయారు. విమానంలో ప్రయాణ సమయం అంతా ఇలానే ఉంచారని, అమృత్సర్లో విమానం దిగిన తర్వాతనే సంకెళ్లు, గొలుసులు తొలగించారని వెల్లడించారు. తొలి విడతలో వచ్చిన భారతీయులు కూడా ఇటువంటి ఆరోపణలు చేసి బాధపడ్డారు. మళ్లీ అటువంటి విధానాన్ని అమెరికా అనుసరించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భారతదేశానికి అమెరికా ఇస్తున్న గౌరవం ఇదేనంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

పెద్ద ఎత్తున గుర్తింపు 

అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను గుర్తించే కార్యక్రమాన్ని అమెరికా పెద్ద ఎత్తున చేపడుతోంది. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్రమ వలసదారులపై దేశ బహిష్కరణ చర్యల్లో భాగంగా గుర్తిస్తోంది. తొలి విడతలో ఈనెల 5న భారతకు చెందిన 105 మంది పౌరులను వెనక్కి పంపించింది. రెండో విమానం 116 మందితో శనివారం రాత్రి 11:30 గంటలకు, మూడో విమానం 112 మందితో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అమృత్ సర్ కు వచ్చాయి. రెండో విడత విమానంలో 65 మంది పంజాబ్, 33 మంది హర్యానాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మూడో విమానంలో హర్యానాకు చెందిన 44 మంది, గుజరాత్ కు చెందిన 33 మంది, పంజాబ్ రాష్ట్రానికి చెందిన 31 మంది ఉన్నారు. రెండో విమానంలో వచ్చిన చిక్కుల్లో ఎవరూ తలపగా చుట్టుకోలేదు. తలపాగా చుట్టుకునేందుకు అమెరికా అధికారులు అనుమతించలేదని సిక్కు వలసదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. చట్టం ప్రకారం అమెరికాకు తీసుకెళ్తామని చెప్పి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ట్రావెల్ ఏజెంట్లు మోసం చేశారని వలసదారులు వెల్లడించారు. డైరెక్ట్ ఫ్లైట్లో అమెరికాకు పంపిస్తామని ట్రావెల్ ఏజెంట్ నమ్మించి మోసం చేయడం ద్వారా తాను నష్టపోవాల్సి వచ్చిందని పంజాబ్ కు చెందిన దల్జిత్ సింగ్ చెప్పాడు. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆశతో పొలాలు తాకట్టు పెట్టి కొందరు, పొలాలు పశువులు అన్ని మరికొందరు తల్లిదండ్రులు ఆ సొమ్ముతో అమెరికాకు పంపించారు. ఇప్పుడు వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్