అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. వైట్ హౌస్ లో ఫెయిత్ హౌస్.!

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆయన తీసుకున్న నిర్ణయాలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు సహా అనేక దేశాలకు చెందిన పౌరులను యుద్ధ విమానాల్లో వారి దేశాలకు తరలిస్తున్నారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. వీటితోపాటు అనేక దేశాలపై సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు. న్యూ ఆర్డిన్స్ లో సూపర్ బౌల్ ఫుట్బాల్ మ్యాచ్ ను ఆయన స్వయంగా వెళ్లి వీక్షించారు.

Trump in the White House

వైట్ హౌస్ లో ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆయన తీసుకున్న నిర్ణయాలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు సహా అనేక దేశాలకు చెందిన పౌరులను యుద్ధ విమానాల్లో వారి దేశాలకు తరలిస్తున్నారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. వీటితోపాటు అనేక దేశాలపై సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు. న్యూ ఆర్డిన్స్ లో సూపర్ బౌల్ ఫుట్బాల్ మ్యాచ్ ను ఆయన స్వయంగా వెళ్లి వీక్షించారు. ఈ ప్రయాణం సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ ఇప్పటికే ట్రెజరీ డిపార్ట్మెంట్లో పలు లోపాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు వీటిని గమనించలేదని.. లేకపోతే అమెరికాపై ఇప్పటికంటే తక్కువ భారం ఉండేదని వెల్లడించారు. ఇటీవల డోజ్ కు ప్రజలలోని సమాచారం చూసేందుకు అనుమతులు లభించాయి. ట్రంప్ 2.0 లో భాగంగా ప్రభుత్వ ఖర్చులకు కళ్లెం వేయడంపై దృష్టి సారించారు. అందులో భాగంగానే ఏజెన్సీలో వృధా వ్యయాలపై దృష్టి సారించింది డోజ్.

ఈ క్రమంలోనే అమెరికా కరెన్సీలో అత్యంత తక్కువ విలువచేసే పెన్నిల తయారీని నిలుపుదల చేయాలని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒక్కో పిన్ని తయారీకి రెండు సెంట్స్ ఖర్చు అవుతోంది. ఇది అమెరికా ఆర్థిక శాఖపై భారాన్ని మోపుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఖర్చును తగ్గించుకునేందుకు పెన్నీల తయారైన నిలుపుదల చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు భారీ సంఖ్యలో ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అలాగే అమెరికాలోని క్రిస్టియన్ ల కోసం ప్రత్యేకంగా వైట్ హౌస్ లో ప్రతి శుక్రవారం పెయిత్ హౌస్ నిర్వహించేందుకు ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమెరికాలోని క్రిస్టియన్లకు వేధింపులు ఉండవన్న విషయాన్ని తెలియజేయడంతో పాటు వారికి భరోసా కల్పించే ఉద్దేశంతో ఫెయిత్ హౌస్ నిర్వహించేందుకు ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో అమెరికాలోని మెజారిటీ క్రిస్టియన్లు ట్రంప్ కు అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. గతంలోనూ ఆయన ప్రచారం సందర్భంగా బైబిల్ పట్టుకొని అమెరికాలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. మనకి ఎన్నికల్లో ఆయనపై దానికి ప్రయత్నించిన తర్వాత తాను దేవుడిని మరింత అధికంగా నమ్ముతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన ఫెయిత్ హౌస్ నిర్వహించేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్