ఇజ్రాయిల్ కు అమెరికా సాయం.. భారీగా యుద్ధ విమానాలు మోహరింపు

ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య కొన్నాళ్లుగా నెలకొన్న యుద్ధ వాతావరణం అంటే అవునన్న సమాధానమే అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల నుంచి వినిపిస్తోంది. కొద్దిరోజుల కిందట ఇరాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులను ఇజ్రాయిల్ చేసింది. ఈ దాడి తర్వాత ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ కూడా హెచ్చరించింది. ఈయన పద్యంలో ఇజ్రాయిల్ కు అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేయడంతోపాటు ఇరాన్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన యుద్ధ విమానాలను అందిస్తామని ప్రకటించింది.

US warplanes in Israel

ఇజ్రాయిల్ చేరిన అమెరికా యుద్ధ విమానాలు

ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య కొన్నాళ్లుగా నెలకొన్న యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకుంటుందా.? అంటే అవునన్న సమాధానమే అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల నుంచి వినిపిస్తోంది. కొద్దిరోజుల కిందట ఇరాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులను ఇజ్రాయిల్ చేసింది. ఈ దాడి తర్వాత ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ కూడా హెచ్చరించింది. ఈయన పద్యంలో ఇజ్రాయిల్ కు అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేయడంతోపాటు ఇరాన్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన యుద్ధ విమానాలను అందిస్తామని ప్రకటించింది. అగ్రరాజ్యం అమెరికా ఈ ప్రకటన చేసి 24 గంటలు గడవకముందే ఇజ్రాయిల్ కు భారీగా యుద్ధ విమానాలను పంపించింది. అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమానాలు బీ-52 స్ట్రాటో ఫొర్ట్రేస్ లు ఇజ్రాయిల్ కు చేరుకున్నాయి. మినాటో ఎయిర్ బేస్ లోనే ఐదో బాంబ్ వింగ్ కు చెందిన బీ-52 స్ట్రాటజిక్ బాంబర్లు ఇప్పుడే సెంట్రల్ కమాండ్ ఏరియాకు చేరుకున్నాయని సెంట్ కామ్ ఎక్స్ లో వెల్లడించింది. ఈ యుద్ధ విమానాలతోపాటు ఫైటర్ జెట్లు, ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్ లు, బాలిస్టిక్ మిసైల్స్ కూడా పంపినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ దీన్ని ధ్రువీకరించారు. ఇరాన్, దాని మద్దతు ఉన్న సంస్థలు తమ సైన్యం, తమ దేశ ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తమ వారిని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అమెరికా బాంబర్లను తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఇరాన్ తీవ్రంగానే స్పందించింది. అగ్ర రాజ్యానికి గట్టిగా సమాధానం చెబుతామని ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేని వార్నింగ్ ఇచ్చారు. తాము తమ అను విధానాన్ని పునః పరిశీలించాల్సి ఉంటుందని ఖమేని సలహాదారు కమల్ ఖర్రాజ్ చెప్పుకొచ్చారు. తాజాగా నెలకొన్న పరిణామాలు నేపథ్యంలో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా యుద్ధ విమానాలను పంపించడంతో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎటువైపు వెళుతుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలంటూ పలువురు కోరుతున్నారు. తాజా చర్యలు నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందన్న ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వాతావరణాన్ని చల్లార్చి ప్రయత్నం చేయాల్సిన ఐక్యరాజ్యసమితి ఆ దిశగా ప్రయత్నాలను చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్