కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సంచలన వ్యాఖ్యలు.. ప్రధానిగా తననే చేస్తామన్నారు అంటూ కామెంట్స్

బిజెపిలో సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ తో అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల ముందు, తరువాత తనను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని ప్రతిపక్షాల నుంచి ప్రపోజల్స్ వచ్చినట్లు గడ్కరి పేర్కొన్నారు. తాను ప్రధాని అభ్యర్థిగా ఉంటే ప్రతిపక్షాలు మద్దతు ఇస్తామని చెప్పాయని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

Union Minister Nitin Gadkari

కేంద్రమంత్రి నితిన్ గడ్కరి

బిజెపిలో సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ తో అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి  కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల ముందు, తరువాత తనను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని ప్రతిపక్షాల నుంచి ప్రపోజల్స్ వచ్చినట్లు గడ్కరి పేర్కొన్నారు. తాను ప్రధాని అభ్యర్థిగా ఉంటే ప్రతిపక్షాలు మద్దతు ఇస్తామని చెప్పాయని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ బదులు ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని, తాము మద్దతు ఇస్తామంటూ ప్రతిపక్షాల నుంచి తనకు ప్రపోజల్స్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత కూడా అలాంటి ప్రతిపాదనలు వచ్చినట్లు వివరించారు. అయితే తాను ఆ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు వెల్లడించారు. మోడీ బదులుగా తాను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడం అనేది బిజెపిలో చీలిక కోసం ప్రతిపక్షాలు చేసిన ప్లాన్ అని తాను అనుకున్నట్లు గడ్కరి ప్రకటించారు. మోడీ పాలనలో తాను తన బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నానని, తనకు ప్రధాని కావాలని కోరిక లేదని స్పష్టం చేశారు. ప్రధాని పదవ పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కూడా లేదని పేర్కొన్న గడ్కరి.. తాను తొలినుంచి ఆర్ఎస్ఎస్ సభ్యుడిని పేర్కొన్నారు.

బిజెపి కార్యకర్తగా తాను ఉన్నానని, తనకు మంత్రి పదవి ఉన్నా లేకపోయినా ఒకటేనని స్పష్టం చేశారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా పార్టీ కోసం పని చేసుకుంటూ ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం గడ్కరి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధాని అభ్యర్థిగా ఉండాలంటూ గడ్కరీ వద్దకు ప్రతిపాదనలను ఎవరు తీసుకువచ్చారన్నదానిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. గడ్కరీ పేర్కొన్నట్టుగా బిజెపిలో చీలిక కోసం ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలోనే కృషి చేసినట్లు దీనిని బట్టి అర్థమవుతోంది. ఎన్నికలకు ముందు కూడా ప్రధాని అభ్యర్థిగా గడ్కరి ఉంటారన్న ప్రచారము జోరుగా సాగింది. ఆర్ఎస్ఎస్ గడ్కరి ప్రధాని అభ్యర్థిగా ఉండాలని కోరినట్టు బయటకు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వ్యవహారం బయటకు రాకుండా బిజెపి అగ్ర నాయకులు చల్లార్చినట్లు చెబుతున్నారు. సాధారణంగా బిజెపిలో 75 సంవత్సరాలు నిండినవాళ్లు కేంద్రమంత్రి పదవులకు కూడా అనర్హులుగా ఉన్నట్లు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ వయసు 74 ఏళ్లు. వచ్చే ఏడాది నాటికి 75 ఏళ్లు పూర్తవుతాయి. ఇదే నిబంధన ప్రధాని మోడీకి వర్తిస్తుందా..? లేకపోతే నిబంధనలో మార్పు చేస్తారా.? అన్నదాని పైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్