అయ్యప్ప భక్తులకు శుభవార్త అందించిన కేంద్రమంత్రి.. ఆ నిబంధనలు సడలింపు

అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విమానాల్లో ప్రయాణించే అయ్యప్ప స్వామి భక్తులు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాల ధరించిన భక్తులు ఇరుముడితో వెళ్లే సమయంలో కొన్ని సమస్యలు భక్తులకు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని పరిష్కరించేలా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చర్యలు చేపట్టారు.

Union Minister Kinjarapu Rammohan Naidu

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు 

అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విమానాల్లో ప్రయాణించే అయ్యప్ప స్వామి భక్తులు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాల ధరించిన భక్తులు ఇరుముడితో వెళ్లే సమయంలో కొన్ని సమస్యలు భక్తులకు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని పరిష్కరించేలా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి అయ్యప్ప స్వామి భక్తులకు ఈ శుభవార్తను అందించారు. ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం పౌరు విమానయాన శాఖ నిబంధనలను సడలించినట్లు వెల్లడించారు. సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం భక్తులు పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్లోనే ప్రయాణించవచ్చు. మండలం నుంచి మకర జ్యోతి దర్శనం వరకు కల్పించిన ఈ అవకాశాన్ని అయ్యప్ప భక్తులు వినియోగించుకోవాలని మంత్రి కోరారు. భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆయన సూచించారు. 

అయ్యప్ప స్వామి భక్తులు ఈ సమయంలో పెద్ద ఎత్తున మాలను ధరించి దీక్ష చేపట్టి, శబరిమల వరకు యాత్ర చేసి అయ్యప్పను దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఆ స్వాములు శబరిమలకు రోడ్డు మార్గంలో, రైలు మార్గంలో, విమానా ప్రయాణం ద్వారా స్వామి సన్నిధికి చేరుకుంటారు. విమానంలో ప్రయాణించే అయ్యప్ప స్వామి భక్తులు ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. భద్రతా కారణాలతో అయ్యప్ప స్వాములు వెంట తెచ్చే ఇరుముడిని చెకిన్ చేయాల్సి ఉంటుందని, దానివల్ల అయ్యప్ప మాల ధరించిన భక్తులు ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పౌర విమాన మంత్రత్వ శాఖ ద్వారా భక్తుల సౌకర్యార్థం చిన్న మార్పులు తీసుకువచ్చినట్లు మంత్రి స్వయంగా వెల్లడించారు. ఇరుముడితో ప్రయాణించే భక్తులు ఆ ఇరుముడిని నేరుగా చేతితో విమానంలోనే తీసుకెళ్లే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. మండలం నుంచి మకర జ్యోతి దర్శనం వరకు విమానంలో ప్రయాణించే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అయ్యప్ప భక్తుల పవిత్ర దీక్షకు భంగం కలుగుకుండా స్వామివారిని దర్శించుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్