బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ.. కీలక కేటాయింపులు ఇవే.!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కొన్ని వర్గాలకు ఊరటను కల్పించేలా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా వేతన జీవులకు టాక్స్ రేట్లు తగ్గింపు భారీ ఊరట ఇచ్చేలా బడ్జెట్లో వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకు ఏడు లక్షల వరకు మాత్రమే ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చారు. తాజా బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు సంపాదించే వారికి టాక్స్ నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల భారీ వేతనాలతో ఉద్యోగులు చేస్తున్న వారికి మేలు చేకూరనుంది. వీటితోపాటు దేశంలో కొత్తగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమం తీసుకురానున్నారు.

Minister Nirmala speaking in Parliament

పార్లమెంట్లో మాట్లాడుతున్న మంత్రి నిర్మల

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కొన్ని వర్గాలకు ఊరటను కల్పించేలా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా వేతన జీవులకు టాక్స్ రేట్లు తగ్గింపు భారీ ఊరట ఇచ్చేలా బడ్జెట్లో వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకు ఏడు లక్షల వరకు మాత్రమే ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చారు. తాజా బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు సంపాదించే వారికి టాక్స్ నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల భారీ వేతనాలతో ఉద్యోగులు చేస్తున్న వారికి మేలు చేకూరనుంది. వీటితోపాటు దేశంలో కొత్తగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమం తీసుకురానున్నారు. దీనిలో భాగంగా దేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో వ్యవసాయ రంగ ప్రోత్సాహకానికి ఉపయోగం పడనుంది. కోటి 70 లక్షల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఆదాయ పన్ను చట్టం మరింత సరళతరం కానుంది. నిబంధనలు, పదాలు దాదాపు 50 శాతం తగ్గించారు. భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం, మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని ఆదాయ పన్ను, టీడీఎస్, v టిసిఎస్ రేట్లు తగ్గింపు, సీనియర్ సిటిజనులకు టీడీఎస్, టిసిఎస్ నుంచి మినహాయింపు మొత్తం లక్ష వరకు పెంపు వంటి నిర్ణయాలను తీసుకున్నారు. 

తాజా బడ్జెట్లో పేదలు, యువత, రైతులు, మహిళలకు పెద్దపీట వేశారు. వచ్చేవారం కొత్త ఇన్కమ్ టాక్స్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు అందించనున్నారు. మూలధన విజయానికి వడ్డీ లేకుండా ఒకటి పాయింట్ 50 లక్షల కోట్లు అందించనున్నారు. భీమారంగంలో విదేశీ పెట్టుబడులు పెంపుకు అవకాశం కల్పించనున్నారు. భీమాలో ఎఫ్డిఐ 74% నుంచి 100% అనుమతి ఇవ్వనున్నారు. లక్ష ఎల్లా నిర్మాణం కోసం 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు 50 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. మెడికల్ టూరిజం ప్రోత్సాహకానికి వీసా నిబంధనలు సరళీకరణ చేయనున్నారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు అందించరున్నారు. మూలధన విజయానికి వడ్డీ లేకుండా ఒకటి పాయింట్ 50 లక్షల కోట్లు అందించనున్నారు. నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టనున్నారు. గ్లిగ్  వర్కర్లకు ఆరోగ్య భీమా, గుర్తింపు కార్డులు అందించనున్నారు. 

అనేక రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు..

బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ను అదే రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా కోసం జాతీయస్థాయి ప్రణాళిక చేపట్టనున్నారు. ఐఐటి పాట్నాను విస్తరించనున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుల నిర్మాణాన్ని బీహార్ లో చేపట్టనున్నారు. పట్టణాభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు. నగరాల అభివృద్ధి కోసం అర్బన్ చాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. 2033 నాటికి ఐదు స్వదేశీ రియాక్టర్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో ఆయుధ ఐఐటీలను ఆధునీకరించనున్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్నారు. 200 ఈ కేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పీఎం స్వనిధి పథకం కింద రుణాలు పెంచనున్నారు. స్టార్టప్ లు కోసం 20 కోట్ల వరకు రుణాలు అందించనున్నారు. ఎంఎస్ఎమ్ఈలకు 20 కోట్ల వరకు రుణాలు అందించాలని నిర్ణయించారు. తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి చేయూత ఇవ్వనున్నారు. కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, మేక్ ఇన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక, అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు కల్పన, ప్రభుత్వ హైస్కూల్ కు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలని నిర్ణయించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రమంత్రి నిర్మల సీతారామన్. మూడు లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచారు. పప్పు ధాన్యాలు ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం అమలు చేయనున్నారు. కంది, మినుములు, మసూర్ పప్పును ఇకపై కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకాన్ని తీసుకురానున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల సీతారామన్ మాట్లాడుతూ గురజాడ అప్పారావు చెప్పిన ' దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనసులోయ్.. ను ప్రస్తావించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్